చిరు152.. నక్సలైట్ పాత్రకు లింక్ ఏంటి?


చిరు152.. నక్సలైట్ పాత్రకు లింక్ ఏంటి?
చిరు152.. నక్సలైట్ పాత్రకు లింక్ ఏంటి?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. సైరా విడుదల ఆలస్యం వల్ల ఇప్పటికే ఏడాదికి పైగా వెయిట్ చేసిన శివ ఈ సినిమాను షూటింగ్ ను శరవేగంగా కానిచ్చేయాలని డిసైడ్ అయ్యాడు. 100 రోజుల వర్కింగ్ డేస్ కు పెరగకుండా షూటింగ్ ముగించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు తన టీమ్ కు సూచనలు చేయడం కూడా జరిగింది.

ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎవొక వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి టైటిల్ గా ఆచార్య ను అనుకుంటున్నట్లు ఇప్పటికే బలమైన వార్తలు వచ్చాయి. అలాగే ఇందులో చిరంజీవి చేసేది దేవాదాయ శాఖలో ఉద్యోగి పాత్ర అని, మొదట సాఫ్ట్ గా ఉంటూనే తర్వాత పవర్ఫుల్ గా మారుతుందని అంటున్నారు. అలాగే ఇందులో రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇందులో రామ్ చరణ్ ఒక నక్సలైట్ గా కనిపించబోతున్నాడట. ముందు ఈ చిత్రం లో చిరంజీవి యంగర్ వెర్షన్ పాత్ర అని అన్నారు కానీ ఇప్పుడు రెండూ వేరు వేరు పాత్రలు అని తెలుస్తోంది.

మరి దేవాదాయ శాఖ ప్రధానంగా సాగే కథలో నక్సలైట్ రోల్ ఎలా వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. జూన్ నుండి రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో ఉన్న చరణ్ అది పూర్తవ్వగానే చిరు సినిమాకు డేట్స్ ఇచ్చాడు. కొరటాల శివ కూడా ముందు మిగతా పోర్షన్ అంతా పూర్తి చేసుకుని రామ్ చరణ్ పోర్షన్ లాస్ట్ షూటింగ్ జరిగేలా షెడ్యూల్ ను మార్చుకున్నారు. త్రిష కథానాయికగా నటించనున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలుస్తాయి.