ఎన్టీఆర్ ఓకే.. మరి చరణ్ సంగతేంటి?


ఎన్టీఆర్ ఓకే.. మరి చరణ్ సంగతేంటి?
ఎన్టీఆర్ ఓకే.. మరి చరణ్ సంగతేంటి?

స్వతహాగా మంచి స్నేహితులైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇప్పుడు కలిసి సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తోన్న విషయం తెల్సిందే. మొదట ఈ చిత్ర షూటింగ్ ను మార్చ్ తో పూర్తి చేద్దామని భావించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ డిలే అయ్యి ఇప్పుడు మే తో పూర్తి చేస్తారు. దీంతో సినిమా కూడా ఈ జులై నుండి వచ్చే సంక్రాంతికి వాయిదా పడిన విషయం తెల్సిందే.

సినిమా వాయిదా పడడంతో ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తోన్న ఇద్దరు టాప్ హీరోల గురించి రకరకాల వార్తలు షికార్లు చేసాయి. ఇద్దరూ కూడా ఈ ఏడాది చివరి దాకా ఫ్రీ అవ్వరని, దానివల్ల రెండేళ్లు ఈ ఇద్దరికీ సినిమాలు అనేవి లేకుండా పోతాయని అనుకున్నారు. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే. ఆర్ ఆర్ ఆర్ షూట్ అయిన కొన్ని రోజులకే ఎక్కువ రోజులు బ్రేక్ తీసుకోకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను మొదలుపెట్టేస్తాడు ఎన్టీఆర్. ఈ సినిమా వచ్చే ఏప్రిల్ లో విడుదల కానుంది. అంటే మూడు నెలల గ్యాప్ లో ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయన్నమాట. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.

ఎన్టీఆర్ సంగతి సరే, మరి తనతో పాటు ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తోన్న రామ్ చరణ్ సంగతేంటి? ఇంకా తన తర్వాతి సినిమా విషయంలో ఎటూ తేల్చుకోలేదు చరణ్. చిరంజీవి సినిమాలో స్పెషల్ రోల్ అనుకున్నా ప్రస్తుతం అది చేయట్లేదని తెలుస్తోంది. హీరోగా చేయాల్సిన నెక్స్ట్ సినిమా విషయంలో ఇంకా తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. పలు డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నా ఏదీ ఖరారు కాలేదు. తాజా సమాచారం ప్రకారం విక్రమ్ కె కుమార్ చెప్పిన కథ చరణ్ ను నచ్చిందట. వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రంపై ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి, అయితే అదిప్పుడు కుదరనుందని తెలుస్తోంది.