చిట్టిబాబు వెల్క‌మ్ చెప్పేశాడుగా!


చిట్టిబాబు వెల్క‌మ్ చెప్పేశాడుగా!
చిట్టిబాబు వెల్క‌మ్ చెప్పేశాడుగా!

వ‌రుస హిట్‌ల‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చాడు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఇదే జోరుని తొలి చిత్రంతోనే మొద‌లుపెట్టాల‌ని అత‌ని త‌మ్ముడు వైష్ట‌వ్‌తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మైత్రీమూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సుక్కు శిష్యుడు చిట్టిబాబు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ని రిలీజ్ చేసి వైష్ట‌వ్ తేజ్‌కి ఇండ‌స్ట్రీలోకి వెల్క‌మ్ చెప్పిన రామ్‌చ‌ర‌ణ్ తాజాగా ఈ చిత్ర పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఫ‌షేస్‌బుక్‌లో రామ్‌చ‌ర‌ణ్ ఆసక్తిక‌ర‌మైన పోస్ట్ ని షేర్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. `బిగ్ వెల్క‌మ్ వైష్ట‌వ్ తేజ్‌!. ఈ ప్ర‌యాణాన్ని నువ్వు ప్రేమిస్తావు, పూర్తిస్థాయిలో దీన్ని ఆస్వాదిస్తావు. బుచ్చిబాబు సానా, కృతిశెట్టి, మైత్రీ మూవీమేక‌ర్స్ టీమ్ అంద‌రికి ఆల్ ది బెస్ట్‌` అని పోస్ట్ పెట్టాడు. ఇది సోష‌ల్ మీడియాలో మెగా ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకుంటోంది.

విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రం జాల‌రుల జీవితాల్లోని వెత‌లు, ప్రేమ‌లు. ప‌గా ప్ర‌తీకారాల్ని తెర‌పై చూపించ‌బోతున్నారు. విజ‌య్‌సేతుప‌తి న‌ట‌న‌, రాక్‌స్టార్ దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం, శామ్‌ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయ‌ట‌. ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుద‌ల కానుంది.