సల్మాన్ కు స్వాగతం పలికిన రామ్ చరణ్


Ram Charan Salman Khan
Ram Charan Salman Khan

బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ కు స్వాగతం పలికాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కొద్దిసేపటి క్రితం ఫేస్బుక్ లో వెల్కమ్ మై బ్లాక్ బస్టర్ ఫ్రెండ్ అంటూ పోస్ట్ చేసాడు.

ఇంతకీ అసలు విషయంలోకి వెళితే. సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా హీరోహీరోయిన్లుగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దబంగ్ 3. సూపర్ హిట్ దబంగ్ సిరీస్ లో ఇది మూడో చిత్రం. డిసెంబర్ 20న విడుదల కానుంది.

అయితే ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదలవనుంది. అందుకే దబంగ్ 3 మోషన్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేసారు. దబంగ్ సిరీస్ స్టైల్లోనే ఈ చిత్రం కూడా ఉంటుందని తెలుస్తోంది. ఆటకైనా, వేటకైనా రెడీ అనే క్యాప్షన్ ఆడియన్స్ ను అలరించడం ఖాయం. సుదీప్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. భారత్ తర్వాత సల్మాన్ చేస్తున్న చిత్రం ఇదే.