ఇదుగో రామ‌రాజు మ‌హోగ్ర రూపం!

Ram Charans fiercest look of alluri sita ramaraju
Ram Charans fiercest look of alluri sita ramaraju

గ‌త ఏడాది రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా  `భీమ్ ఫ‌ర్ రామ‌రాజు` వీడియోని విడుద‌ల చేసి `ఆర్ఆర్ఆర్‌` మేక‌ర్స్ మెగా ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చిన విష‌యం తెలిపిందే. అయితే అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్‌కి సంబంధించిన లుక్‌ని కానీ వీడియోని కానీ రిలీజ్ చేయ‌లేదు. దీంతో రామ‌రాజు లుక్‌లో రామ్‌చ‌ర‌ణ్ ఎలా వుంటారా అని మెగా అభిమానుల‌తో పాటు సినీ ప్రియులు గ‌త కొంత కాలంగా ఎదురుచూస్తున్నారు.

ఆ రోజు రానే వ‌చ్చింది. మ‌రోసారి రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు రావ‌డంతో రామ‌రాజు మ‌హోగ్ర రూపానికి సంబంధించిన అవ‌తారాన్ని రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని మేక‌ర్స్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ప్ర‌క‌టించిన‌ట్టుగానే శ‌నివారం రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే జ‌ర‌గ‌నుండ‌గా శుక్ర‌వారం సాయంత్రం రామ‌రాజు మ‌హోగ్ర రూపాన్ని రిలీజ్ చేశారు. ప్ర‌కృతి నిప్పులు క‌క్కుతున్న వేళ నింగికి విల్లు ఎక్కుపెట్టిన రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారారాజు లుక్ ఆక‌ట్టుకుంటోంది.

దీంతో మెగా ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా రామ‌రాజు లుక్‌ని షేర్ చేసిన ఎన్టీఆర్
‌`అతను ధైర్యవంతుడు.
అతను నిజాయితీపరుడు.
అతను నీతిమంతుడు.
ఇదుగో అల్లురిసితారామరాజు తీవ్ర‌మైన అవ‌తారంలో నా సోదరుడు రామ్‌చరణ్` అంటూ ట్వీట్ చేశారు. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా అక‌ట్ఓబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే.