చరణ్ తర్వాతి సినిమాపై ఇప్పటినుండే రూమర్లు

చరణ్ తర్వాతి సినిమాపై ఇప్పటినుండే రూమర్లు
చరణ్ తర్వాతి సినిమాపై ఇప్పటినుండే రూమర్లు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో చరణ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. దీని తర్వాత రామ్ చరణ్ సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించనున్న రాజకీయ నేపథ్యంలో కలిగిన చిత్రంలో రామ్ చరణ్ నటించనున్నాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తాడని సమాచారం. మరో మూడు నెలల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ 16వ సినిమాపై ఇప్పటినుండే రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ప్రధానంగా ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో పాటు సీనియర్ దర్శకుడి పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం రానుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగకతప్పదు.