వ‌ర్మ‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ యుద్దం మొద‌లైంది!వ‌ర్మ‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ యుద్దం మొద‌లైంది!
వ‌ర్మ‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ యుద్దం మొద‌లైంది!

రామ్ గోపాల్ వ‌ర్మ‌పై ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్ యుద్దం మొద‌లైంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ని శ్రీ‌రెడ్డి చేత బూతులు తిట్టించిన వ‌ర్మ అక్క‌డితో ఆగ‌క ప‌వ‌న్‌పై సినిమా తీస్తూ మ‌రో ర‌చ్చ‌కు తెర‌లేపారు. లాక్‌డౌన్ త‌రువాత ఇండ‌స్ట్రీ మొత్తం ఏం చేయాలో తెలియ‌ని దీనావ‌స్థ‌లో వుంటే వ‌ర్మ మాత్రం పోర్న్ స్టార్స్‌తో పోర్న్ సినిమాలు చేస్తూ వ‌రుస‌గా ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు.

`క్లైమాక్స్‌`.. ఆ త‌రువాత చేసిన `నేక్డ్‌` (న‌గ్నం) కూడా పోర్న్ సినిమా త‌ర‌హాతే కావ‌డంతో వ‌ర్మ‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం మొద‌లైంది. పోర్న్ సినిమాల‌ని ప‌క్క‌న పెట్టిన వ‌ర్మ తాజాగా ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ `ప‌వ‌ర్‌స్టార్‌` పేరుతో సినిమా తీస్తూ కొత్త వివాదానికి తెర‌లేపాడు. `ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత క‌థ‌` అంటూ ర‌చ్చ‌కు తెర లేపాడు వ‌ర్మ‌. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి మండింది. వారు కూడా వ‌ర్మ‌పై యుద్ధం ప్ర‌క‌టించారు.

`ప‌రాన్న జీవి` పేరుతో వ‌ర్మ‌ని ఏకి పారేయ‌డం మొద‌లుపెట్టారు. తాజాగా మ‌రో అభిమాని సంజీవ్ రెడ్డి `పార్న్ జీవి` పేరుతో ఓ సినిమాని ప్ర‌క‌టించాడు. పెళ్లాం వ‌దిలేసిన ఒక ద‌ర్శ‌కుడి క‌థ అనే క్యాప్ష‌న్ ఇచ్చాడు. గురివింద గింజ‌కి త‌న కింద ఉన్న న‌లుపు క‌నిపించ‌దు..ఒక ముస‌లి జీవి జీవితంలో జ‌రిగిన య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా .. అంటూ వ‌రుస క్యాప్ష‌న్‌ల‌తో మోతెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇది వ‌చ్చే లోపు ఇంకెంత మంది వ‌ర్మ‌ప ఐసినిమా అంటూ ఆడుకోవ‌డం మొద‌లుపెడ‌తారో చూడాలి.