వ‌ర్మ రేపు స‌ర్ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారా?


వ‌ర్మ రేపు స‌ర్ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారా?
వ‌ర్మ రేపు స‌ర్ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారా?

క‌రోనా ఓ ప‌క్క విళ‌య‌తాండ‌వం చేస్తుంటే వివాదాల వ‌ర్మ మాత్రం దాన్ని కూడా ప‌బ్లిసిటీకి వాడేస్తూ వ‌రుస ట్వీట్‌లు చేసిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ న‌డుస్తున్నా త‌న‌దైన శైలిలో పోస్ట్‌లు పెడుతూ వార్త‌ల్లో నిలిచారు రామ్ గోపాల్‌వ‌ర్మ‌.  వివాదాస్ప‌ద అంశాల్ని త‌న సినిమాలకు క‌థా వ‌స్తువులుగా చేసుకుంటూ సినిమాలు నిర్మిస్తున్న వ‌ర్మ ఆ మ‌ధ్య `జీఎస్టీ` (గాడ్ సెక్స్ అండ్ ట్ర‌క‌ అంటూ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ సంచల‌నం సృష్టించింది. దీనిపై చాలా మంది అభ్యంత‌రం కూడా చెప్పారు. అయితే ఈ ఫిల్మ్‌ని తాను స్కైపీ ద్వారా రూపొందించాన‌ని, తాను సెట్‌లో లేన‌ని అబ‌ద్దాలు చెప్పిన వ‌ర్మ తాజాగా మ‌రోసారి వివాదానికి తెర‌లేపుతున్నారు. ఇటీవ‌ల వ‌రుస వివాదాస్ప‌ద చిత్రాల‌తో వార్త‌ల్లో నిలిచిన వ‌ర్మ లాక్‌డౌన్ వేళ మ‌రోసారి మియా మాక్కోవాతో మ‌రో వివాదానికి తెర లేపేలా వున్నాడ‌ని తెలుస్తోంది.

`క్లైమాక్స్` పేరుతో మ‌రో సినిమాని రూపొందించాన‌ని, దీనికి సంబంధించిన టీజ‌ర్‌ని గురువారం సాయంత్రం 5 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌బోతున్నాన‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు వ‌ర్మ‌. ఈ చిత్రాన్ని ఆర్‌.ఎస్‌. ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రేయాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నార‌ట‌.