యాంక‌ర్ల‌ని కూడా వ‌ర్మ వ‌ద‌ల‌డం లేదు‌!


యాంక‌ర్ల‌ని కూడా వ‌ర్మ వ‌ద‌ల‌డం లేదు‌!
యాంక‌ర్ల‌ని కూడా వ‌ర్మ వ‌ద‌ల‌డం లేదు‌!

`శివ‌`.. టాలీవుడ్ ద‌శ‌ని దిశ‌ని మార్చిన ఓ గేమ్ ఛేంజ‌ర్‌. అప్ప‌టి వ‌ర‌కు వున్న మూస ధోర‌ణికి చ‌ర‌మ‌గీతం పాడి న్యూ వే ఆఫ్ మేకింగ్‌కి నాంది ప‌లికిన చిత్ర‌మిది. తెలుగు సినిమాకు కొత్త సొబ‌గుల‌ద్దిన సినిమా ఇది. ఇప్ప‌టికీ ఈ చిత్రాన్ని, ఈ చిత్ర టేకింగ్‌ని, ఈ చిత్ర నేప‌థ్య సంగీతాన్ని బీట్ చేసిన సినిమాలు పెద్ద‌గా రాలేదంటే `శివ‌` టాలీవుడ్ తెర‌పై ఎలాంటి ముద్ర‌ను వేసిందో అర్థం చేసుకోవ‌చ్చు. అలాంటి చిత్రాన్ని అందించిన రామ్ గోపాల్ వ‌ర్మ ది గ్రేట్ డైరెక్ట‌ర్‌ల లిస్ట్‌లో చేరిపోయారు.

ఇది గ‌త కొన్నేళ్ల కింద‌ట మాట‌. ఇప్ప‌డు వ‌ర్మ అంటే తొడ‌ల మ‌ధ్య కెమెరాలు పెట్టేవాడా? .. సైలెన్స్‌గా వున్న వాళ్ల జీవితాల్లో త‌న కాల‌క్షేపం కోసం విళ‌యాన్ని సృష్టించేవాడా? అన్నంత‌గా మారిపోయింది. ఇదే చాల‌ద‌న్న‌ట్టుగా వ‌ర్మ మ‌రింత‌గా కిందికి జారిపోతున్నాడ‌న‌డానికి తాజాగా వ‌ర్మ యాంక‌ర్ల‌తో ప్ర‌వ‌ర్తించిన తీరే ఇందుకు అద్దం ప‌డుతోంది.

త‌న‌ని ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వ‌చ్చిన యాంక‌ర్‌తో నిన్ను బికినీలో చూడాల‌ని వుంద‌ని, ఇంత అందంగా వున్న నువ్వు ఈ ఫీల్డులో వుండ‌ట‌మేంటి?  నా ద‌గ్గ‌రికి వ‌స్తే నీ జాత‌క‌మే మార్చేస్తాన‌ని చెప్ప‌డం వ‌ర్మ మాన‌సిక స్థితిని తెలియజేస్తోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆశ్చ‌ర్యాన్ని అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. తాజాగా ఓ యాంక‌ర్ ని థైస్ క‌నిపించ‌కుండా డ్రెస్ వేసుకుని వ‌చ్చి త‌న‌ని అవ‌మానిస్తున్నావ‌ని, మ‌రోసారి ఇంట‌ర్వ్యూ చేస్తే నీ థైస్ క‌నిపించేలా డ్రెస్ వేసుకుని రావాల‌ని వ‌ర్మ ఫ్లూటింగ్ చేయ‌డం షాక్ కు గురిచేస్తోంది. మ‌రీ ఇంత‌లా వ‌ర్మ దిగ‌జారాడేంట‌ని అంతా అవాక్క‌వుతున్నారు.