రామ్‌ గోపాల్ వ‌ర్మ‌కు ఆ గ‌ట్స్ వున్నాయా?


రామ్‌ గోపాల్ వ‌ర్మ‌కు ఆ గ‌ట్స్ వున్నాయా?
రామ్‌ గోపాల్ వ‌ర్మ‌కు ఆ గ‌ట్స్ వున్నాయా?

క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో సినీ ఇండ‌స్ట్రీ సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ స‌మ‌యంలో షూటింగ్‌లకు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తుల మంజూరు చేసినా క‌రోనా భ‌యంతో సెట్‌లోకి రావ‌డానికి ఏ స్టార్ హీరో ధైర్యం చేయ‌డం లేదు. ఇదిలా వుంటే రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం వారినికో సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తూ వ‌రుస షాకులిస్తున్నాడు.

పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో `క్లైమాక్స్‌`, కాస్ట్యూమ్ డిజైన‌ర్ శ్రీ రాపాక‌తో `నేక్డ్ (న‌గ్నం) వంటి చిత్రాల్ని అందించిన వ‌ర్మ త్వ‌ర‌లో మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్య నేప‌థ్యంలో `మ‌ర్డ‌ర్‌`, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ నేప‌థ్యంలో `ప‌వ‌ర్‌స్టార్‌`, 12 ఓ క్లాక్‌` వంటి చిత్రాల్ని త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌మ‌బోతున్నారు. ప‌వ‌ర్‌స్టార్‌, ‌మ‌ర్డ‌ర్ చిత్రాల‌తో కాంట్ర‌వ‌ర్సీకి తెర‌లేపిన వ‌ర్మ పై సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి.

వీళ్ల మీద కాదు వ‌ర్మ ప్ర‌తాపం చూపించాల్సింది. ద‌మ్ముంటే గ‌తంలో ప్ర‌క‌టించిన `రెడ్డిగారు పోయారు` తీయ‌మ‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప‌వ‌న్‌ని, అమృత‌ని టార్గెట్ చేయ‌డం కాదు వ‌ర్మ‌కు నిజంగా గ‌ట్స్ వుంటే వై.ఎస్. రాజ‌శేఖ‌ర‌రెడ్డి నేప‌థ్యంలో ప్ర‌క‌టించిన `రెడ్డిగారు పోయారు` చిత్రాన్ని రూపొందించాల‌ని నెటిజ‌న్స్ కొంత మంది వ‌ర్మ‌కు స‌వాల్ విసురుతున్నారు. మ‌రి వ‌ర్మ‌కు ఆ గ‌ట్స్ వున్నాయా?. ఏపీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్‌ని కాద‌ని `రెడ్డిగారు పోయారు` చిత్రాన్ని వ‌ర్మ తీయ‌గ‌ల‌డా? ..