అడ్డంగా దొరికి పోయిన వ‌ర్మ‌!


అడ్డంగా దొరికి పోయిన వ‌ర్మ‌!
అడ్డంగా దొరికి పోయిన వ‌ర్మ‌!

సోష‌ల్ మీడియాని వాడుకోవ‌డంతో వ‌ర్మ త‌రువాతే ఎవ‌రైనా. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఆర్టీవీ థియేట‌ర్ అంటూ ఓటీటీని మొద‌లుపెట్టి వ‌రుస‌గా సినిమాల్ని రిలీజ్  చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో `థ్రిల్ల‌ర్‌` పేరుతో ఓ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అప్స‌ర రాణిని హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేస్తున్నారు.

ఒడిశ్శాకు చెందిన అప్స‌ర రాణిని ఈ చిత్రం ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నాన‌ని, ఇన్నాళ్లూ ఇంత‌టి అందాన్ని ఎలా మిస్స‌య్యాన‌ని గ‌త రెండు రోజులుగా వ‌ర్మ సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. అప్స‌ర‌రాణిపై ప్రేమ‌ను వ‌ల‌క‌బోస్తున్నారు. గ‌త రెండు రోజులుగా అప్స‌ర‌రాణి ఎవ‌రా అనే అన్వేష‌ణ మొద‌లైంది. షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

వ‌ర్మ ప‌రిచ‌యం చేస్తున్నాన‌ని ఊద‌ర‌గొడుతున్న అప్స‌ర‌రాణి అస‌లు పేరు అంకితా రానా. 4 లెట‌ర్స్‌, ఉల్లాలా ఉల్లాలా చిత్రాల్లో న‌టించింది. ఈ రెండు చిత్రాల్లో అంకితా రానా హ‌ద్దులు దాటి ఎక్స్పోజింగ్ చేసింది. అయినా ఫ‌లితం లేకుండాపోయింది. దీంతో పేరు మార్చుకుని అప్స‌ర రాణిగా వ‌ర్మ థ్రిల్ల‌ర్‌తో మ‌ళ్లీ ర‌చ్చ చేయ‌డానికి సిద్ధ‌మైంది. ఈ విష‌యం తేలిపోవ‌డంతో అప్స‌ర రాణి పేరుతో వ‌ర్మ చేస్తున్న మోసం బ‌య‌ట‌ప‌డింది.