వాళ్ల‌ని ముద్దు పెట్టుకోవాల‌నిపిస్తోంద‌ట‌!వాళ్ల‌ని ముద్దు పెట్టుకోవాల‌నిపిస్తోంద‌ట‌!
వాళ్ల‌ని ముద్దు పెట్టుకోవాల‌నిపిస్తోంద‌ట‌!

రామ్ గోపాల్ వ‌ర్మ క‌రోనా కంటే భ‌యంక‌రంగా త‌యార‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఓ ప‌క్క క‌రోనా విళ‌య‌తాండ‌వం చేస్తోంది. జ‌నం ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వ‌స్తుందా అని భ‌యంతో వ‌ణికిపోతున్నారు. బ‌య‌టికి రావాలంటేనే కొంత మంది వ‌ణికిపోతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని కూడా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్న ఏకైక జీవి ఆర్జీవీ. వివాదాస్ప‌ద చిత్రాల‌తో నిత్యం సంచ‌ల‌నం సృష్టిస్తూ వార్త‌ల్లో నిలుస్తున్న రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ `ప‌వ‌ర్‌స్టార్‌` పేరుతో ఓ మినీ చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే.

దీనిపై వివాదం మొద‌లైంది. జ‌న‌సైనికులు, ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈ చిత్రంపై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు. వ‌ర్మ‌పై ఘాటుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా గురువారం జూబ్లీహిల్స్‌లోని రామ్ గోపాల్ వ‌ర్మ కార్యాల‌యంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఎనిమిది మందిని జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్టు చేసి ఆ త‌రువాత విడిచి పెట్టారు.

ఇదిలా వుంటే త‌న ఆఫీస్‌పై జ‌రిగిన దాడిపై రామ్ గోపాల్‌వ‌ర్మ స్పందించారు. `జ‌న‌సేన  కార్య‌క‌ర్త‌లుగా చెప్పుకునే పీకే ఫ్యాన్స్ నా కార్యాల‌యంపై దాడి చేశారు. ఈ దాడికి పాల్ప‌డిన వారిని సెక్యూరిటీ గార్డులు, పోలీస్‌లు అరెస్ట్ చేశారు. అయితే `ప‌వ‌ర్‌‌స్టార్‌`కు ఇంఆక ఎక్కుడ‌వ పబ్లిసిటీని క‌ల్పించినందుకు ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టాల‌నుంది` అని వ‌ర్మ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.