వ‌ర్మ‌కు హాట్ ఆట‌మ్ బాంబ్ దొరికింది!


వ‌ర్మ‌కు హాట్ ఆట‌మ్ బాంబ్ దొరికింది!
వ‌ర్మ‌కు హాట్ ఆట‌మ్ బాంబ్ దొరికింది!

క‌రోనా భ‌యంతో లాక్‌డౌన్ ని స‌డ‌లించినా షూటింగ్‌లు చేయ‌డానికి స్టార్ హీరోలు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. దీంతో చిన్నా చిత‌కా సినిమాలు కూడా షూటింగ్ చేయ‌డానికి జంకుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రామ్‌గోపాల్ వ‌ర్మ వ‌రుస సినిమాల్ని వ‌దులుతుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో `క్లైమాక్స్‌` చిత్రాన్ని నిర్మించి ఇప్ప‌టికే రిలీజ్ చేసిన వ‌ర్మ తాజాగా `నేక్డ్‌` ( న‌గ్నం) పేరుతో మ‌రో చిత్రాన్ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్య నేప‌థ్యంలో `మ‌ర్డ‌ర్‌` చిత్రాన్ని, హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో `12 ఓ క్లాక్‌` చిత్రాన్ని  తెర‌కెక్కిస్తున్న వ‌ర్మ త్వ‌ర‌లో మ‌రో చిత్రానికి కూడా శ్రీ‌కారం చుడుతున్నారు. స్వీటీతో `నెక్డ్‌` చిత్రాన్ని రూపందించి సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేసిన వ‌ర్మ తాజాగా `థ్రిల్ల‌ర్` పేరుతో ఓ సినిమాని నిర్మిస్తూ ఈ చిత్రం ద్వారా హాట్ ఆట‌మ్ బాంబ్‌ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఈ విష‌యాన్ని వ‌ర్మ స్వ‌యంగా వెల్ల‌డించారు.

`థ్రిల్ల‌ర్` సినిమా కోసం అప్స‌ర రాణిని ప‌రిచ‌యం చేస్తున్నాను. ఒడిశాలో పుట్టి, డెహ్ర‌డూన్‌లో పెరిగి ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వుంటోంది. ఆమె మంచి న‌టి క‌న్నా అద్బుత‌మైన డ్యాన్స‌ర్. అప్స‌ర‌ని క‌ల‌వ‌డానికి ముందు త‌న‌కు ఒడిశా గురించి ఏమీ తెలియ‌ద‌ని, ఒడిశా అంటే నాకు తెలిసింది 199లో వ‌చ్చిన హ‌రికేన్ ఒక్క‌టేన‌ని, అయితే అప్స‌ర‌ని క‌లిసిన త‌రువాత ఒడిశా అన్ని ర‌కాల హ‌రికేన్‌లని సృష్టించింద‌ని తెలుసుకున్నాన‌ని, ఒడిశాలో ఇంత అందం దాగి వుంద‌ని ఇప్పుడే తెలుసుకున్నాన‌ని, ఇది ఒడిశాకు మ‌రింత బ‌లం అని అప్స‌ర ఫొటోల‌ని వ‌ర్మ ట్వీట్ చేశారు.