ముంబై లో రాంగోపాల్ వర్మ ఆవిష్కరించిన “ఆగ్రహం” టీజర్


Agraham
Agraham

ఎస్ ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకం పై సుదీప్, సందీప్, రాజు, సుస్మిత హీరోహీరోయిన్లుగా  ఆర్. ఎస్ .సురేష్ దర్శకత్వంలో సందీప్ చెరుకూరి నిర్మాతగా రూపొందిన చిత్రంఆగ్రహంఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ ను రాంగోపాల్ వర్మ ముంబై లో ఆవిష్కరించారు .

ఈ కార్యక్రమం లో చిత్ర దర్శకుడు సురేష్నిర్మాత చెరుకూరి సందీప్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి, సంగీత దర్శకుడు రవి శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు .   ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ మాట్లాడుతూరాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే గ్యాంగ్ స్టర్  కధాంశమిది. ఈ చిత్రం లోఫైట్స్ ఉంటాయి.’ఆఫీసర్, సర్కార్చిత్ర లకు సంగీతాన్ని అందించిన రవిశంకర్ ఆర్ ఆర్ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణఅని అన్నారు.                     

చిత్ర నిర్మాత  సందీప్ మాట్లాడుతూ కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది.ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్  అడా రి  మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా పాస్ట్ గా తెర కేకించాం  .జులై లో ఈ చిత్రాన్ని  విడుదల చేయనున్నాం.’ అన్నారు.ఈ చిత్రానికి కెమెరా:ఎస్. రామకృష్ణ, ఎడిటర్:జె. పి, ఆర్ ఆర్ :రవిశంకర్,ఎగజిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆడా రి మూర్తి, నిర్మాత,:చెరుకూరి సందీప్, దర్సకత్వం:ఆర్. ఎస్. సురేష్