మ‌రో థ్రిల్ల‌ర్‌ని రెడీ చేస్తున్నాడు!


మ‌రో థ్రిల్ల‌ర్‌ని రెడీ చేస్తున్నాడు!
మ‌రో థ్రిల్ల‌ర్‌ని రెడీ చేస్తున్నాడు!

ప్ర‌పంచం ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోకి వెళ్లినా, సినిమాలు నిర్మించ‌లేని ప‌రిస్థితులు త‌లెత్తినా ఈ ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ సినిమాలు నిర్మించ‌గ‌ల ఏకైక వ్య‌క్తి రామ్‌గోపాల్‌వ‌ర్మ‌. లాక్ డౌన్ కార‌ణంగా సినీ ఇండస్ట్రీ అన్ని కార్య‌క్ర‌మాల‌కు మూకుమ్మ‌డిగా తాళం వేసేసింది. ఇండ‌స్ట్రీలో ఎలాంటి కార్య‌క‌లాపాలు ప్రారంభం కాని ప‌రిస్థితి. అలాంటి స‌మ‌యంలోనూ `క్లైమాక్స్‌`, `క‌రోనా`, నేక్డ్ (నగ్నం) పేర్ల‌తో వ‌న్ బై వ‌న్ సినిమాలు రిలీజ్ చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

ప్రస్తుతం `న‌గ్నం` సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా గ‌డిపేస్తూ యాంక‌ర్ల‌కి బిస్కెట్‌లు వేస్తున్న వ‌ర్మ మ‌రో మూడు సంచ‌ల‌న చిత్రాల్ని తెర‌కెక్కిస్తున్నారు. మిర్యాల‌గూడ పరువు హ‌త్య నేప‌థ్యంలో `మ‌ర్డ‌ర్‌`, ప‌వ‌ర్‌స్టార్  పేరుతో మ‌రో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన రోజైన సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇదిలా వుంటే ఈ రెండు చిత్రాలతో పాటు వ‌ర్మ మ‌రో హార‌ర్ థ్రిల్ల‌ర్‌ని రూపొందిస్తున్న‌ట్టు తెలిసింది.

`12 ఓ క్లాక్‌` పేరుతో వ‌ర్మ ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్‌ని రూపొందిస్తున్నారు. దీనికి రాత్‌, భూత్ చిత్రాల‌కు వాడిన టెక్నిక్‌నే ఈ చిత్రానికీ వాడుతున్నార‌ట‌. ఈ చిత్రానికి ఎం.ఎం. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. శుక్ర‌వారం రాత్రి ఏడు గంట‌ల‌కు ఈ చిత్ర ట్రైల‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ వ‌ర్మ `12 ఓ క్లాక్‌` పోస్ట‌ర్‌ని షేర్ చేశారు.