రాంగోపాల్ వర్మ కొత్త చిత్రం వైరస్


ram gopal varma next movie virus

ఇటీవలే నాగార్జున తో ఆఫీసర్ వంటి డిజాస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకులు రాంగోపాల్ వర్మ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు . ” వైరస్ ” అనే చిత్రాన్ని త్వరలోనే తెరకేక్కిన్చానున్నట్లు ప్రకటించాడు కూడా . తాజాగా వైరస్ చిత్రాన్ని చేయబోతున్నట్లు ట్వీట్ చేసాడు వర్మ . ఇక ఈ సినిమాని నిర్మించే నిర్మాత పేరు కూడా ప్రకటించాడు . ఇంతకుముందు వర్మ దర్శకత్వంలో ” సర్కార్ ” , ” ఎటాక్ ఆఫ్ 26/11” చిత్రాలను నిర్మించిన పరాగ్ సంఘ్వి ఈ చిత్రాన్ని నిర్మిస్తాడట .

వైరస్ కథాంశం ఏంటంటే ……. ఆఫ్రికా కు వెళ్లిన ఓ విద్యార్థి అక్కడ వైరస్ బారిన పడి ఇండియాకు తిరిగి రావడం భారత్ లో ఘోరమైన ప్రాణనష్టం జరగడం . అయితే నటీనటులు ఎవరు ? సాంకేతిక నిపుణులు ఎవరు ? అన్నది ఇంకా తెలపలేదు వర్మ . మొత్తానికి ఆఫీసర్ చిత్రం ఇచ్చిన షాక్ లో వర్మ ఉన్నాడని అనుకుంటే అది మన పొరపాటే ! అని వైరస్ తో నిరూపిస్తున్నాడు విచిత్ర జీవి అయిన రాంగోపాల్ వర్మ .