వ‌ర్మ నెక్స్ట్ టార్గెట్ ఆ హీరో నేనా!వ‌ర్మ నెక్స్ట్ టార్గెట్ ఆ హీరో నేనా!
వ‌ర్మ నెక్స్ట్ టార్గెట్ ఆ హీరో నేనా!

లాక్‌డౌన్ కార‌ణంగా స్టార్ ప్రొడ్యూస‌ర్‌లు, స్టార్ హీరోలు, ద‌ర్శ‌కులు ఎలాంటి షూటింగ్‌లు లేక ఇంటి కే ప‌రిమిత‌మైతే వ‌ర్మ మాత్రం వ‌రుస‌గా మినీ మూవీలు తీస్తూ టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. ఇటీవ‌ల పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో `క్లైమాక్స్‌`, కాస్ట్యూమ్ డిజైన‌ర్ శ్రీ రాపాక‌తో `నేక్డ్‌`( న‌గ్నం) చిత్రాల్ని రూపొందించి వ‌దిలిన వ‌ర్మ త్వ‌ర‌లో మిర్యాల‌గూడ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో `మ‌ర్డ‌ర్‌` పేరుతో ఓ చిత్రాన్ని చేస్తున్న విష‌యం తెలిసిందే.

దీనితో పాటు మ‌రో సంచ‌ల‌న చిత్రానికి శ్రీ‌కారం చుట్టి టాలీవుడ్‌లో ప్ర‌కంప‌ణ‌లు సృష్టిస్తున్నారు. అదే `ప‌వ‌ర్‌స్టార్‌`. స్టార్ హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కథ కాదంటూనే ఆయ‌న ఎన్నిక‌ల్లో ఓడిన నాటి ప‌రిస్థితుల్ని తీసుకుని వివాదాస్ప‌ద అంశాల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. వ‌రుసగా మూవీ స్టిల్స్‌ని రిలీజ్ చేస్తూ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్న వ‌ర్మ ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ కూడా రెడీ చేశాడు. ఇదిలా వుంటే వ‌ర్మ మ‌రో హీరోని టార్గెట్ చేసిన‌ట్టు తెలిసింది. ఆయ‌నే నంద‌మూరి బాల‌కృష్ణ‌. టీడీపీ ఎమ్మెల్యేకూడా కావ‌డంతో ఆయ‌న‌ని వ‌ర్మ టార్గెట్ చేసిన‌ట్టు చెబుతున్నారు.

కొన్నేళ్ల క్రితం బాల‌కృష్ణ ఇంట్లో కాల్పులు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై ఇండ‌స్ట్రీలో ఏళ్ల త‌ర‌బ‌డి పెద్ద చ‌ర్చే జ‌రిగింది. దీన్నే క‌థ‌వ‌స్తువుగా తీసుకుని వ‌ర్మ త‌న ఓటీటీ కోసం సినిమా చేయ‌బోతున్నార‌ట‌. `ఆ రాత్రి ఏం జ‌రిగిందంటే` అనే టైటిల్‌ని కూడా ఈ చిత్రానికి అనుకుంటున్న‌ట్టు తెలిసింది. ఇదే నిజ‌మైతే వ‌ర్మ ఈసారి ఏకంగా తేనె తుట్టెని క‌దిపిన‌ట్టేన‌ని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు.