ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ ప్లాన్ చేస్తున్నారా?


ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ ప్లాన్ చేస్తున్నారా?
ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ ప్లాన్ చేస్తున్నారా?

రామ్ గోపాల్ వర్మ‌.. వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్క‌డ ప్ర‌శాంతంగా వుంటుందో ఆ ప్ర‌శాంత‌త‌కు భంగం క‌లిగిస్తూ త‌న పాపులారిటీ కోసం సంచ‌ల‌నం సృష్టించ‌డం వ‌ర్మ‌కు ముందు నుంచీ అల‌వాటుగా మారింది. గ‌తంలో శ్రీ‌రెడ్డిని అడ్డంపెట్టుకుని మెగా క్యాంప్‌లో ర‌చ్చ‌కు తెర‌లేపిన వ‌ర్మ చివ‌రికి ఎంత వ‌ర‌కు వెళ్లాడంటే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ని బూతులు తిట్టించి ఆనందించేంత. శ్రీ‌రెడ్డితో ప‌వ‌న్‌ని బూతులు తిట్టించి ఆ త‌రువాత అల్లు అర‌వింద్ రంగ ప్ర‌వేశం చేయ‌డంతో సైలెంట్ అయిపోయిన వ‌ర్మ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయ‌డం మొద‌టుపెట్టాడు.

తాజాగా `ప‌వ‌ర్‌స్టార్‌` సినిమాతో పెద్ద ర‌చ్చ‌కు తెర‌లేపిన వ‌ర్మ ఈ సినిమాతో చేయాల్సినంత ర‌చ్చ చేస్తున్నాడు. ఫ‌స్ట్ లుక్ స్టిల్స్‌, వ‌ర్కింగ్ స్టిల్స్ అంటూ అడిగినా, అడ‌క్క పోయినా స్టిల్స్‌ని వ‌దులుతూ తాజాగా టీజ‌ర్‌తో పెను దుమారానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సినిమా ఈ నెల 25న విడుద‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే వ‌ర్మ మ‌రో కాంట్ర‌వ‌ర్సీకి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఉద‌య్ కిర‌ణ్ హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత క్ర‌మంగా అత‌ని క్రేజ్ త‌గ్గిపోవ‌డంతో హ‌ఠాత్తుగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇదే అంశాన్ని తీసుకుని ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్‌ని వ‌ర్మ తెర‌పైకి తీసుకురావాల‌ని, త‌ద్వారా మెగా ఫ్యామిలీని ఇరుకున పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.