వ‌ర్మ లేదు లేదంటూనే ఫ‌స్ట్ లుక్ వ‌దిలాడు!

వ‌ర్మ లేదు లేదంటూనే ఫ‌స్ట్ లుక్ వ‌దిలాడు!
వ‌ర్మ లేదు లేదంటూనే ఫ‌స్ట్ లుక్ వ‌దిలాడు!

రామ్ గోపాల్ వ‌ర్మ ఎక్క‌డ వుంటే అక్క‌డ వివాదం వుంటుంది. వివాదం లేనిదే ఆయ‌న లేడు అన్న‌ది ప్ర‌తీ ఒక్క‌రికీ తెలిసిందే. ఇటీవ‌ల ఆర్టీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ పేరుతో ఏటీటీని ప్రారంభించిన వ‌ర్మ వ‌రుస‌గా సినిమాలు రిలీజ్ చేస్తూ షాకులిస్తున్నాడు. తాజాగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై `ప‌వ‌ర్‌స్టార్‌` పేరుతో ఓ సినిమా తీయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన వ‌ర్మ వివాదం ముద‌ర‌డంతో `ప‌వ‌ర్‌స్టార్‌` అనే పేరు చూసి అంతా త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నార‌ని, తాను ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌యోపిక్ తీయ‌డం లేద‌ని వెల్ల‌డించారు.

దీంతో వ‌ర్మ ప‌వ‌ర్‌స్టార్‌పై సినిమా తీసే ఆలోచ‌న‌ను విర‌మించుకున్నార‌ని అంతా భావించారు. కానీ గురువారం ఉద‌యం 11:37 నిమిషాల‌కు `ప‌వ‌ర్‌స్టార్‌` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసి వ‌ర్మ అంద‌రికి షాకిచ్చారు. `ప‌వ‌ర్‌స్టార్` టైటిల్ మ‌ధ్య‌లో `జ‌న‌సేన‌` పార్టీ గుర్తు గాజు గ్లాసుని పెట్టిన వర్మ తాను ఏం తీయ‌బోతున్నాడో క్లియ‌ర్‌గా చెప్పేయ‌డం గ‌మ‌నార్హం.

గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు `ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌` అనే క్యాప్ష‌న్ ఇవ్వ‌డం మ‌రింత ర‌చ్చ‌కు తెర‌తీసేలా క‌నిపిస్తోందిని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు, వ‌ర్మ‌కు మ‌ధ్య వార్ డిసైడైన‌ట్టేన‌ని అర్థ‌మ‌వుతోంది. వ‌ర్మ రిలీజ్ చేసిన `ప‌వ‌ర్‌స్టార్‌` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌పై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.