వ‌ర్మకు చిక్కిన ప‌వ‌ర్‌స్టార్ ఇత‌నే!


వ‌ర్మకు చిక్కిన ప‌వ‌ర్‌స్టార్ ఇత‌నే!
వ‌ర్మకు చిక్కిన ప‌వ‌ర్‌స్టార్ ఇత‌నే!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా నిత్యం ర‌ద్దీగా వుంటే సినిమా షూటింగ్ లు బంద్ అయిపోయాయి. కానీ రామ్‌గోపాల్ వ‌ర్మ మాత్రం నిత్యం బిజీగానే వుంటున్నారు. కొత్త‌గా ఆర్జీవీ వ‌ర‌ల్డ్ పేరుతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని మొద‌లుపెట్టిన వ‌ర్మ తొలి ప్ర‌య‌త్నంగా  మియా మాల్కోవాతో `క్లైమాక్స్‌`, లోక‌ల్ భామ‌తో `న‌గ్నం‌` వంటి చిత్రాల‌ని అందించి భారీగానే దండుకున్నాడు. త్వ‌ర‌లో `మ‌ర్డ‌ర్‌` పేరుతో మిర్యాల‌గూడలో జ‌రిగిన‌ ప‌రువు హ‌త్యోదంతం నేప‌థ్యంలో ఓ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్టోరీతో `ప‌వ‌ర్‌స్టార్‌` పేరుతో ఓ సినిమాకు వ‌ర్మ శ్రీ‌కారం చుడుతున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన వ‌ర్మ ఇటీవ‌ల ప‌వ‌న్‌ని పోలిన ఓ వ్య‌క్తిని ప‌వ‌న్ పాత్ర కోసం ఫిక్స్ చేసుకోబోతున్నారు. భ‌ద్రాచ‌లం జిల్లా‌కు స‌మీపంలోని సార‌పాక కు చెందిన టిక్ టాక్ స్టార్ ర‌మేష్‌ని ప‌వ‌న్ పాత్ర కోసం వ‌ర్మ ఎంపిక చేసుకున్న‌ట్టు తెలిసింది.

టిక్ టాక్‌లో అత‌ని వీడియోలు చూసిన వ‌ర్మ స్వ‌యంగా అత‌న్ని త‌న ఆఫీసుకి పిలిపించి ఆఫ‌ర్ ఇస్తాన‌ని, కేవ‌లం ప‌ది రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తాన‌ని చెప్పాడ‌ట‌. అయితే రెమ్యున‌రేష‌న్ త‌దిత‌ర విష‌యాల‌కు సంబంధించిన టాక్స్ జ‌రుగుతున్నాయ‌ని, ఇంకా చ‌ర్చ‌లు ఓ కొలిక్కిరాలేద‌ని తెలిసింది.