ట్రైల‌ర్‌కు కూడా రేటు క‌ట్టేశాడు!


ట్రైల‌ర్‌కు కూడా రేటు క‌ట్టేశాడు!
ట్రైల‌ర్‌కు కూడా రేటు క‌ట్టేశాడు!

కొంత మంది ఆలోచిస్తూ ప‌ని చేస్తారు. మరి కొంత మంది ఆలోచించి ఆ త‌రువాత ప‌ని కానిచ్చేస్తారు. వ‌ర్మ ఇందులో మొద‌టి ర‌కం.. ఆలోచిస్తూనే త‌న ప‌ని మూడో కంటికి తెలిసే లోపు పూర్తి చేసేస్తున్నాడు. లాక్‌డౌన్ కార‌ణంగా ఇండ‌స్ట్రీ అంతా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే పైసా ఖ‌ర్చు చేయ‌కుండా ఫ్రీ ప‌బ్లిసిటీతో వ‌రుస‌గా సినిమాల‌ని వ‌న్ బై వ‌న్ వ‌దులుతున్నాడు. దీంతో వ‌ర్మ ప్లాన్‌కు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు షాక్‌కి గుర‌వుతున్నార‌ట‌.

ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ పేరుతో శ్రేయాస్ ఈటీతో క‌లిసి ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని ప్రారంభించిన వ‌ర్మ తొలి ప్ర‌య‌త్నంగా అడ‌ల్ట్ కంటెంట్‌తో క్లైమాక్స్‌, నేక్డ్ ( న‌గ్నం) వంటి మినీ చిత్రాల్ని రిలీజ్ చేసి సంచ‌ల‌నం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రో మూడు చిత్రాల్ని లైన్‌లో పెట్టిన వ‌ర్మ కొత్త బిజినెస్‌కి తెర‌లేప‌డం ఇండ‌స్ట్రీ పెద్ద‌ల్ని అవాక్క‌య్యేలా చేస్తోంది. ఏదైనా కొత్త సినిమా టీజ‌ర్ ట్రైల‌ర్‌ని ప్రేక్ష‌కుల కోసం యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటారు. కానీ వ‌ర్మ మాత్రం `ప‌వ‌ర్‌స్టార్‌` ట్రైల‌‌ర్‌ని యూట్యూబ్‌లో కాకుండా త‌న ఓటీటీలో మాత్ర‌మే రిలీజ్ చేస్తున్నార‌ట‌.

దీనికి వ్యూకి రూ. 10/- నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. ఇంత‌కు ముందు ట్రైల‌ర్స్ లా `ప‌వ‌ర్‌స్టార్‌` ట్రైల‌ర్‌ని ఫ్రీగా చూసుకునే వీలులేదు. ప‌ది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తేనే ట్రైల‌ర్ చూడొచ్చు.. ఈ ఐడియాకు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు షాక‌వుతున్నాయ‌ట‌. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో ఏపీ ఎన్నిక‌ల త‌రువాత ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి అనే అంశాల నేప‌థ్యంలో వ‌ర్మ `ప‌వ‌ర్‌స్టార్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై స‌ర్వ‌త్రా భారీ క్రేజ్ ఏర్ప‌డింది.