రజనీకాంత్ సినిమాతో పోటీపడుతున్న అడల్ట్ సినిమా


Ram gopal varma ready to fight with rajini' 2. 0

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రం తో పోటీపడుతోంది అడల్ట్ చిత్రం భైరవ గీత . రాంగోపాల్ వర్మ శిష్యుడు దర్శకత్వం వహించిన భైరవ గీత ఈనెల 30 న విడుదలకు సిద్ధమైంది . ఈనెల 29 న రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుండగా ఆ మరుసటి రోజున భైరవ గీత చిత్రం విడుదల కానుంది . 29 న రజనీ సినిమా విడుదల అవుతుంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మధ్యాహ్నం కల్లా తెలుస్తుంది , సినిమా బాగుంటే రజనీకాంత్ సినిమా కాబట్టి ఓవర్ ఫ్లో ఉంటుంది దాంతో టికెట్లు దక్కని వాళ్ళు భైరవ గీత సినిమాకు వస్తారని భావిస్తున్నారు .

అలాగే ఒకవేళ రజనీకాంత్ 2. ఓ బాగోలేకపోతే దాని ప్రభావం ఖచ్చితంగా భైరవ గీత చిత్రం పై పడుతుంది . రజనీకాంత్ సినిమా కంటే భైరవ గీత చూడండి అని మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే ఇలా ధైర్యం చేసి వస్తున్నారు . గతకొంత కాలంగా రజనీకాంత్ నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూనే ఉన్నాయి అందుకే వర్మ మా అడల్ట్ సినిమా చూడండి అంటూ ప్రేక్షకులను కవ్విస్తున్నాడు . చూద్దాం ఈనెల 29 న ఏం జరుగుతుందో ?

English Title: Ram gopal varma ready to fight with rajini’ 2. 0