ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ!ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ!
ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొడుతున్న ఆర్జీవీ!

వివాదం లేని చోట వివాదాన్ని, స‌మ‌స్య‌లేని చోట స‌మ‌స్య‌ని సృష్టించిన దాని ద్వారా ల‌బ్ది పొంద‌డం వ‌ర్మ‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఎక్క‌డ వివాదం వుంటే అక్క‌డ‌.. వివాదం ఎక్క‌డ సృష్టించ‌బ‌డుతుందో అక్క‌డ వ‌ర్మ త‌న ఉనికిని చ‌యాటుకుంటూ ఇన్నేళ్లైనా వెట‌ర‌న్ ద‌ర్శ‌కుల లిస్ట్‌లోకి వెళ్ల‌కుండా నిత్యం లైమ్ లైట్‌లో వుంటున్నారు. గ‌త కొంత కాలంగా వివాదాస్ప‌ద అంశాలే త‌న సినిమాల‌కు క‌థా వ‌స్తువులుగా చేసుకుంటూ వ‌రుస‌గా సినిమాలు తీస్తున్నారు.

ఎంత మంది చూశారు. అవి ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాయి. అని కాకుండా త‌న‌కు ఎంత ద‌క్కింది. ఎంత త‌న పేరు వినిపించింది అన్న చందంగానే వ‌ర్మ త‌న కెరీర్‌ని కొన‌సాగిస్తున్నారు. తాజాగా వర్మ మ‌రో వివాదాస్ప‌ద అంశాన్ని తీసుకున `ప‌వ‌ర్‌స్టార్‌`పేరుతో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ల్యాణ్ ఏపీ ఎన్నిక‌ల త‌రువాత ఎదుర్కొన్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో వివాదాస్ప‌ద చిత్రంగా దీన్ని వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు వ‌ర్కింగ్ స్టిల్స్‌ని రిలీజ్ చేసి నిప్పు రాజేసిన వ‌ర్మ తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాట‌ని రిలీజ్ చేశాడు.

`గ‌డ్డి తింటావా..` పాట‌కు ఐదు గంట‌ల్లో ఐదు ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయ‌ట‌. 20 వేల డిస్‌లైకులు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇది తెలిసి నేను షాక‌య్యాను. పీకే ఫ్యాన్ గా బాధ‌ప‌డుతున్నాను. పీకే ఫ్యాన్స్ డిజ్‌లైక్ 20 వేలేనా? అంటూ వ‌ర్మ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.