పవర్ స్టార్ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టేసిన రామ్ గోపాల్ వర్మ


పవర్ స్టార్ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టేసిన రామ్ గోపాల్ వర్మ
పవర్ స్టార్ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టేసిన రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. క్వాలిటీ సినిమాలను అందించడం ఎప్పుడో ఆపేసిన వర్మ ఇప్పుడు వారానికో సినిమా అన్నట్లు ఇష్టమొచ్చినట్లు చుట్టిపడేస్తున్నాడు. రీసెంట్ గా క్లైమాక్స్, నగ్నం అంటూ రెండు సినిమాలను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా క్వాలిటీ గురించి, కంటెంట్ గురించి చర్చించుకోవడం కూడా అనవసరం. అయితే ఈ రెండు సినిమాలతో వర్మ లాభాలు అందుకోవడంతో ఇక తనను ఆపేవారు లేరన్నట్లు సినిమాలను ప్రకటించుకుంటూ పోతున్నాడు.

ఇటీవలే మర్డర్, 12 ఓ క్లాక్ అంటూ రెండు సినిమాల ప్రాజెక్టు వివరాలను వర్మ అనౌన్స్ చేసాడు. దాంతో పాటే పవర్ స్టార్ ను కూడా అనౌన్స్ చేసాడు. టైటిల్ చూడగానే అది ఎవరిని ఉద్దేశించి తీసే సినిమానో అందరికీ అర్ధమైంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎవరినీ ఉద్దేశించి కాదని కవర్ చేసుకునే ప్రయత్నం చేసాడు. అనవసరంగా పవర్ స్టార్ ను టార్గెట్ చేయడం చాలా మందికి నచ్చలేదు. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించడానికి ఒక నటుడ్ని కూడా ఎంపిక చేసుకున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ను వర్మ పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది. టైటిల్ రోల్ పోషించాల్సిన వ్యక్తి ఈ సినిమాలో నటించకూడదని ఫిక్స్ అవ్వడంతో చేసేదేం లేక వర్మ కూడా ప్రాజెక్ట్ వదులుకున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్త నిజమో కాదో.