నిఖిల్ ఎవ‌డో నాకు తెలియ‌దు – ఆర్జీవీనిఖిల్ ఎవ‌డో నాకు తెలియ‌దు - ఆర్జీవీ
నిఖిల్ ఎవ‌డో నాకు తెలియ‌దు – ఆర్జీవీ

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న వివాదాస్ప‌ద చిత్రం `ప‌వ‌ర్‌స్టార్‌`. ఈ మూవీపై ప్ర‌స్తుతం ర‌చ్చ న‌డుస్తోంది. జ‌న‌సేన సైనికులు, ప‌వ‌న్ ఫ్యాన్స్ తో పాటు ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ అంటే ఇష్టం వున్న సెల‌బ్రిటీలు వ‌ర్మ‌పై మండిప‌డుతున్నారు. కొంత మంది చాటుగా వ‌ర్మ‌ని విమ‌ర్శిస్తుంటే మ‌రి కొంత మందేమో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఘాటుగా విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు.

`ప‌వ‌ర్‌స్టార్‌` ట్రైల‌ర్‌ని చూసిన హీరో నిఖిల్ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ని కుక్క‌తో పోలుస్తూ సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. `శిఖ‌రంని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మ‌హా శిఖ‌రం త‌ల‌తిప్పి చూడ‌దూ…మీకు అర్థ‌మైందా? ` అంటూ నిఖిల్ పెట్టిన పోస్ట్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. యంగ్ హీరో వ‌ర్మ‌పై విరుచుకుప‌డి ఆయ‌న్ని కుక్క‌తో పోల్చ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేసింది.

దీనిపై వ‌ర్మ ఓ టీవీ ఛాన‌ల్ లైవ్‌లో ఘాటుగా స్పందించారు. యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పిన వ‌ర్మ త‌న‌కు నిఖిల్ ఎవ‌రో తెలి‌య‌ద‌న్నారు. నిఖిల్ కావ‌చ్చు… కిఖిల్ కావ‌చ్చు వీళ్లంతా ప‌వ‌న్‌క‌ల్యాణ్  తొత్తులు. ఇలా తొత్తుల్లా వుంటే వీళ్ల‌మీద ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మంచి అభిప్రాయం వ‌స్తుంద‌ని వీళ్ల ఆశ‌. బానిస‌త్వం అనే బుద్ధిలోనుంచి వ‌చ్చే ఆలోచ‌న ఇది. నిఖిల్ ఎవ‌డో నాకు తెలియ‌దు. ఒక పెద్ద స్టార్ అయ్యుండొచ్చు కానీ నాకు తెలియ‌దు` అని వ‌ర్మ స‌మాధానం చెప్పారు.