ఇక్క‌డ ఎవ‌డూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు!



ఇక్క‌డ ఎవ‌డూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు!
ఇక్క‌డ ఎవ‌డూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు!

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఒక‌ప్పుడు సంచ‌ల‌న చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన వ‌ర్మ గ‌త కొంత కాలంగా వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతున్నారు. నిత్యం ఏదో ఒక అంశంతో వివాదాన్ని సృష్టించి సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేస్తున్నారు. తాజ్ కాల్పుల ఘ‌ట‌న త‌రువాత మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో క‌లిసి వెళ్లి సినిమా తీస్తానంటూ స్కెచ్ వేసిన వ‌ర్మ అప్ప‌ట్లో రాజ‌కీయంగా పెను దుమారాన్ని సృష్టించారు.

ఇక తెలుగులో ఆయ‌న ఇటీవ‌ల చేసిన ప్ర‌తీ సినిమా ఓ వివాద‌మే. తాజాగా ఆయ‌న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న చిత్రం `ప‌వ‌ర్‌స్టార్‌`. క‌రోనా వైర‌స్‌తో జ‌నం భ‌యంతో వ‌ణికిపోతుంటే డోంట్ కేర్ అంటూ వివాదాస్ప‌ద చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు వ‌ర్మ‌. ఈ సినిమా పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ చూసిన ప‌వ‌న్ ఫ్యాన్స్  వ‌ర్మ‌పై మండిప‌డుతున్నారు. తాజాగా వ‌ర్మ ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

“ప‌వ‌ర్‌స్టార్‌` కేవ‌లం ఫిక్ష‌న్ సినిమా మాత్ర‌మే. ఎవ‌రినీ ఉద్దేశించి తెర‌కెక్కించ‌లేదు. కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం మాత్ర‌మే తీసింది. వార్నింగ్‌లు ఇస్తే భ‌య‌ప‌డ‌టానికి ఇక్క‌డ ఎవ‌డూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. నేను ఒక్క‌డినే వున్నా. నా ఆఫీస్ అంద‌రికి తెలుసు. గూగుల్ మ్యాప్స్‌లో కూడా దొరుకుతుంది. ర‌మ్మ‌నండి ఎవ‌రినైనా చూద్దాం` అని వ‌ర్మ ఘాటుగా స్పందించారు.