శ‌భాష్ వ‌ర్మ ట్వీట్ అదిరింది!

శ‌భాష్ వ‌ర్మ ట్వీట్ అదిరింది!
శ‌భాష్ వ‌ర్మ ట్వీట్ అదిరింది!

`శివ‌`తో ట్రెండ్ క్రియేట‌ర్‌గా, ట్రెండ్ సెట్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న రామ్‌గోపాల్ వ‌ర్మ ఆ త‌రువాత కాలంలో త‌న స్థాయిని తానే క్ర‌మ క్ర‌మంగా త‌గ్గుంచుకుంటూ వ‌స్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా సిల్లీ ట్వీట్‌లు పెడుతూ జ‌నానికి రోత‌పుట్టించిన వ‌ర్మ క‌రోనా వేళ మాత్రం త‌న ఇంట‌లిజెన్సీని ప్ర‌ద‌ర్శిస్తూ శ‌భాష్ అనిపించుకుంటున్నారు.

చిల్ల‌ర ట్వీట్‌లు వేస్తూ జ‌నంలో ప‌లుచ‌న అయిన వ‌ర్మ క‌రోనా వైర‌స్ మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఇంట‌లిజెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వివాదాల‌కు ముందుంటూ వార్త‌ల్లో నిలుస్తున్న వ‌ర్మ తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని టార్గెట్ చేశారు. దేశంలో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. దీన్ని అరిక‌ట్ట‌డంతో మోదీ స‌ర్కారు దారుణంగా విఫ‌ల‌మైంది. ఆక్సిజ‌న్ లేక‌పోవ‌డంతో ఇటీవ‌ల 25 మంది చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ప‌రీస్థితులు ఇంత దారుణంగా మార‌డానికి మోదీ బాధ్య‌తా వైఫ‌ల్య‌మేన‌ని ప్ర‌తిప‌క్షాల‌తో , సామాన్య ప్ర‌జ‌లతో పాటు ప్ర‌పంచ దేశాలన్నీ మండిప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌, కేర‌ళ ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌ట్టిక‌ర‌వ‌డంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌ర్మ ట్వీట్‌ల వ‌ర్షం కురిపిస్తూ మోదీతో పాటు బీజేపీపై అదిరిపోయే పంచ్‌లేస్తున్నారు. ఢిల్లీ స్మ‌శాన వాటిక‌లో ద‌హ‌నం అవుతున్న చితులకు సంబందించిన ఫొటోల‌ని షేర్ చేసిన వ‌ర్మ ఇలాంటి హార‌ర్ విజువ‌ల్స్ ఇచ్చినందుకు మోదీకి థ్యాంక్స్ అని, ఆయ‌న ప‌ద‌వి ఊడినా ప్ర‌పంచంలోనే అత్యంత భ‌యంక‌ర‌మైన హార‌ర్ ఫిల్మ్ మేక‌ర్‌గా ఆయ‌న బ‌తికేయెచ్చ‌ని సెటైర్ వేశారు.

మూడో వేవ్ వ‌చ్చాక తాను మోదీ ద‌గ్గ‌ర స్పాట్ బాయ్‌గా చేర‌తాన‌ని వేసిన సెటైరిక‌ల్ ట్వీట్ నెట్టింట అద‌రిపోయింది. దీనిపై ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. అంతే కాకుండా మెడీషాల‌ని బోల్తా కొట్టించి మ‌మ‌తా బెన‌ర్జీ సాధించిన విక్ట‌రీని ఫ‌న్నీగా సూచిస్తూ వ‌ర్మ షేర్ చేసిన వీడియో నెట్టింట న‌వ్వులు పూచిస్తోంది. వ‌ర్మ తాజా ట్వీట్స్  ఫాలో అవుతున్న వాళ్లంతా శ‌భాష్ వ‌ర్మ ట్వీట్ అదిరింది అంటున్నారు.