రామ్‌గోపాల్‌ వ‌ర్మ కూడా పాటేసుకున్నాడు!


రామ్‌గోపాల్‌ వ‌ర్మ కూడా పాటేసుకున్నాడు!
రామ్‌గోపాల్‌ వ‌ర్మ కూడా పాటేసుకున్నాడు!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఎక్క‌డ చూసినా క‌రోనా పాజిటివ్ కేసులే. ఏ దేశం గురించి విన్నా క‌రోనా చావులే. యావ‌త్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా సోక‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ప్ర‌జ‌లు ఇళ్ల‌కేప‌రిమితం కావాల‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే లాక్ డౌన్ ని ప్ర‌క‌టించి ప‌రిస్థితిని  ఎప్ప‌టి క‌ప్పుడు ప‌ర్య‌వేశిస్తున్నాయి.

ఇదిలా వుంటే క‌రోనా పై పాట‌ల ప‌రంప‌ర మొద‌లైంది. సెల‌బ్రిటీలు క‌రోనా అవేర్‌నెస్‌లో భాగంగా క‌రోనా మ‌హ‌మ్మారిపై పాట‌ల్ని రిలీజ్ చేస్తే ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఇటీవ‌ల కోటి ఓ పాట‌ని రిలీజ్ చేయ‌గా కీర‌వాణి కూడా స్టూడెంట్ నెం.1`లోని ఓ గీతాన్ని మార్చి క‌రోనాపై పాట‌ని చేశారు. తాజాగా రామ్‌గోపాల్‌వ‌ర్మ కూడా ఓ పాటేసుకున్నారు.

ప్ర‌త్యేకంగా తానే రాసి వ‌ర్మ ఈ పాట‌ని పాడ‌టం ఆక‌ట్టుకుంటోంది. క‌రోనా వైర‌స్‌ని ఓ పురుగుగా పోలుస్తే `క‌నిపించ‌ని పురుగు క‌రోనా… అంటూ వ‌ర్మ పాడి యాక్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్గా మారింది. చేతులు క‌డుక్కున్నాకే ఈ పాట‌ని వినాల‌ని వ‌ర్మ అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. పైగా పూర్తి పాట‌ని సాయంత్రం విడుద‌ల చేస్తాన‌ని ఆర్జీవీ వెల్ల‌డించారు. టీజ‌రే ఇలా వుంటే పూర్తి పాట ఇంకెలా వుంటుందో అని నెటిజ‌న్స్ కామెంట్‌లు పెడుతున్నారు.