మరో వివాదం మొదలు పెట్టిన వర్మ


Ram Gopal Varma
Ram Gopal Varma

కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రానికి రూపకల్పన చేసిన వివాదాస్పద దర్శకులు తాజాగా మరో వివాదానికి శ్రీకారం చుట్టాడు . రేపు ఉదయం కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రంలోని మొదటి పాటని విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు . దాంతో రేపటి పాట వివాదానికి కేంద్ర బిందువు అవ్వడం ఖాయమని భావిస్తున్నారు . ఈరోజు ఉదయం వర్మ చేసిన ట్వీట్ తో మరో వివాదం ఖాయమని తెలుస్తోంది .

అసలు కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ప్రకటించాడు కానీ ఇది అయ్యేదేనా ? అని అనుకున్నారు కట్ చేస్తే రేపు పాట అని చెప్పడంతో బహుశా ఈ సినిమా స్టార్ట్ అయి ఉండొచ్చు అని తెలుస్తోంది . ఆంధ్రప్రదేశ్ లో కమ్మ రాజ్యం ( చంద్రబాబుప్రభుత్వం ) పోయి రెడ్ల రాజ్యం (జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ) వచ్చిన నేపథ్యంలో ఈ పాటకు ప్రాధాన్యత సంతరించుకుంది .