వ‌ర్మ‌కు హై ఫీవ‌ర్‌.. కండ‌లు చూపించిన వ‌ర్మ‌!



 

Ram gopal varma suffering high fever
Ram gopal varma suffering high fever

క‌రోనా వైర‌స్ భ‌యంతో ఇంటి నుంచి బ‌య‌టికి రావ‌డానికి భ‌య‌ప‌డుతుంటే వ‌ర్మ మాత్రం వ‌రుసగా ఓటీటీ కోసం సినిమాలు వ‌దులుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న విష‌యం తెలిసిందే. వైర‌స్‌ని లెక్క చేయ‌కుండా వ‌ర్మ లాగే షూటింగ్ లు చేసుకుంటున్న సీరీయ‌ల్ న‌టులు వ‌రుస‌గా వైర‌స్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌ర్మకు కూడా వైర‌స్ సోకింద‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం మొద‌లైంది. వ‌ర్మ ఈ వార్త‌ల్ని లైట్ తీసుకున్నారు. అయితే తాజాగా ఆయ‌న‌కు గ‌తం రెండు మూడు రోజులుగా కండ‌రాల నొప్పి, హైఫీవ‌ర్ వస్తోంద‌ని తెలిసింది.

దీంతో ఆయ‌న‌కు వైర‌స్ సోకింద‌ని ప్ర‌చారం మొద‌లైంది. ఈ విష‌యం తెలుసుకున్న వ‌ర్మ త‌న‌కు హైఫీవ‌ర్ వున్న ఆఫిట్‌గా వున్నాన‌ని మ‌జిల్ ఎక్స‌ర్‌సైజ్ చేస్తున్న ఓ వీడియోని పోస్ట్ చేశారు. త‌న‌పై వ‌స్తున్న పూకార్ల‌పై సెటైర్లు కూడా వేశారు వ‌ర్మ‌. వ‌ర్మ‌కు ఫీవ‌ర్ త‌గ్గ‌క‌పోవ‌డంతో డాక్ట‌ర్ల‌ని సంప్ర‌దిస్తే ఇది వైర‌ల్ పీవ‌ర్ అని, పెద్ద‌గా కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చార‌ట‌. అయినా వ‌ర్మ‌లో భ‌యం పోలేద‌ని తెలుస్తోంది.

నెటిజ‌న్స్ మాత్రం ఈ పాయింట్‌తో వ‌ర్మ‌ని ఫుట్ బాల్ ఆడేసుకున్నారు. మంచిది మంచిది అంటూ మీమ్స్‌ని వ‌దిలారు. కొంత మందేమో సామాన్య ప్ర‌జ‌లు టెస్ట్ చేయించుకుంటున్న ఫొటోల్ని వ‌ర్మ‌కు ట్యాగ్ చేసి ఎందుకైనా మంచిది మ‌రోసారి టెస్ట్ చేయించుకో అనే అర్థం వ‌చ్చేలా షేర్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.