ఆగష్ట్ మొదటి వారంలో రామ్ సినిమా ప్రారంభం!!Ram Pothineni
Ram Pothineni

“ఇస్మార్ట్ శంకర్” రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో మాస్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది. ముఖ్యంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల నుండి టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజులనుండి ఆకలిగొన్న పులిలా విజృంభిస్తూ.. పూరి తనదైన మార్కుతో ఇస్మార్ట్ శంకర్ ని తెరపై అవిష్కరించాడు. ఇదిలా ఉండగా రామ్ నటించే కొత్త సినిమా ఆగష్ట్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.

ఈ సినిమాకి నేను శైలజ, చిత్రలహరి, దర్శకుడు కిషోర్ తీరుమల దర్శకత్వం చేయనున్నాడు. ఇందులో రామ్ కి జోడీగా నివేథా థామస్ హీరోయిన్ గా నటించనుంది. లేటెస్టుగా నివేతా బ్రోచేవారెవరురా హిట్ చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.