ఇస్మార్ట్ రామ్ ..మళ్ళీ అదే సెంటిమెంట్Ram Pothinen repeat once again with Mani Sharma
Ram Pothinen repeat once again with Mani Sharma

యువ హీరో రామ్ పోతినేని చాలా కాలం తరువాత ఒక ఫుల్ మాస్ స్టయిల్ లో  తో సాలీడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా చిత్ర యూనిట్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి బూస్ట్ ఇచ్చింది. అందరికంటే ఎక్కువగా సినిమాపై మణిశర్మ ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా మంచి మ్యూజిక్ అందిస్తున్నప్పటికి మెలోడీ బ్రహ్మ వర్క్ చేసిన సినిమాలు సక్సెస్ కావడం లేదు.

దీంతో తన కసి మొత్తాన్ని ఇస్మార్ట్ శంకర్ తో బయటపెట్టాడు. సినిమాలో మ్యూజిక్ కూడా స్ట్రాంగ్ గా క్లిక్కయ్యింది. దాదాపు అన్ని పాటలు బెస్ట్ హిట్స్ గా నిలిచాయి. యూట్యూబ్ లో మిలియన్ వ్యూవ్స్ తో దూసుకుపోతున్నాయ్. ఇకపోతే  రామ్ తన తరువాతి సినిమాకు కూడా మణిశర్మ ని సెలెక్ట్ చేసుకోవాలని ముందే డిసైడ్ అయ్యాడట. ఇస్మార్ట్ శంకర్ ఆల్బమ్ మొత్తం విన్న అనంతరం నెక్స్ట్ సినిమా ఎలాంటిదైనా పర్లేదు, మిరే నా నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని రామ్ అప్పుడే మాట కూడా ఇచ్చేశాడట.
అందుకే కిషోర్ తిరుమల ‘రెడ్’ సినిమా ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అసలైతే దర్శకుడు కిషోర్ తిరుమల తను చేసిన మొదటి మూడు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ నే ఎంచుకున్నాడు. ఈ సారి కూడా మళ్ళీ అతనే రామ్ సినిమాకు సెలెక్ట్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ రామ్ కమిట్మెంట్ కి కిషోర్ తిరుమల రాక్ స్టార్ ని పక్కనెట్టక తప్పలేదు. మరి ఈ సినిమాకి మణిశర్మ ఎలాంటి మ్యూజిక్ ని అందిస్తాడో చూడాలి. ఇక ‘రెడ్’ సినిమాను స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తుండగా మాళవిక శర్మ – నివేత పేతురాజ్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు.