విమర్శకులపై సెటైర్ వేసిన హీరో రామ్


ram pothineni
ram pothineni

హీరో రామ్ విమర్శకులపై సెటైర్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది . తాజాగా ఈ హీరో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . కాగా ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గ నిలిచింది . హీరో రామ్ కెరీర్ లో నెంబర్ వన్ చిత్రంగా నిలవడంతో ఈ హీరో చాలా సంతోషంగా ఉన్నాడు . అయితే ఇదే సమయంలో ఈ సినిమాపై విమర్శలు కూడా వస్తున్నాయి దాంతో రామ్ తీవ్రంగా స్పందించాడు .

హీరో సిగరెట్ తాగుతున్నాడు , అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు , హెల్మెట్ పెట్టుకోవడం లేదు , దమ్ము కొడుతున్నాడు అంటూ చాలామంది విమర్శిస్తున్నారు కానీ హీరో అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తున్నాడు అది మాత్రం ఎవరికీ కనిపించలేదు అంటూ వెటకారంగా ట్వీట్ చేసాడు హీరో రామ్ . ఇంతకీ ఈ హీరో ఉద్దేశ్యం ఏంటంటే ఇన్ని విమర్శలు చేసున్న వాళ్లకు హత్యలు కనబడలేదా ? హీరో క్యారెక్టర్ అది అంటూ సెటైర్ వేయడమే కాకుండా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయ్యింది గుర్తు పెట్టుకోండి అన్నట్లుగా ట్వీట్ చేసాడు రామ్.