రామ‌రాజు మార్నింగ్ వ‌ర్క‌వుట్స్‌!

రామ‌రాజు మార్నింగ్ వ‌ర్క‌వుట్స్‌!
రామ‌రాజు మార్నింగ్ వ‌ర్క‌వుట్స్‌!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఫిట్‌నెస్ తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. గ‌త కొన్నేళ్లుగా నటుడిగా త‌న‌ని తాను మార్చుకుంటూ మ‌రింత కొత్త‌గా అభిమానుల‌కు క‌నిపించ‌డానికి త‌న వంతు శ్ర‌మిస్తున్నారు. తన తొలి చిత్రం `చిరుత` నుండి `వినయ విద్యా రామ` వరకు రామ్ చరణ్ ఎప్ప‌టి క‌ప్పుడు త‌న‌ని తాను మార్చుకుంటూ వ‌చ్చాడు. ఇక `ఆర్ ఆర్ ఆర్‌`కి వ‌చ్చేస‌రికి పూర్తి ఫిట్‌నెస్‌తో రామ‌రాజుగా మారిపోయారు.

తాజాగా ఈ రోజు ఉదయం చరణ్ తన వ్యాయామం సెషన్ తర్వాత ఒక ఫొటోని అభిమానుల కోసం పోస్ట్ చేశారు. ఇదే సంర్భంగా త‌న‌ అభిమానులకు ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరాడు. రామ్ చరణ్ ఉదయాన్నే నిద్రలేచి తన వ్యక్తిగత వ్యాయామశాలలో తన వ్యాయామ సెషన్‌ను పూర్తి చేశాడు. అనంత‌రం తను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటోని పోస్ట్ చేసి `బలమైన ఉదయం.. మ‌రింత బ‌లంగా ప్రారంభించలేరు` అని పోస్ట్ చేశారు.

ఇక త‌ను పోస్ట్ చేసిన ఫొటోలో చ‌ర‌ణ్ మెలితిరిగిన కండ‌ల‌తో మ‌రింత ఫిట్‌గా క‌నిపిస్తున్న తీరు ఆయ‌న అభిమానుల‌తో పాటు ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్‌`తో పాటు `ఆచార్య‌`లోనూ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు చిత్రాల షూటింగ్‌లతో ఆయ‌న బిజీగా వున్నారు. త్వ‌ర‌లోనే శంక‌ర్ డైరెక్ష‌న్‌లో చేయ‌బోతున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించిన కీల‌క అప్ డేట్ రాబోతోతున్న విష‌యం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)