రామ్ `రెడ్‌` డిజిట‌ల్ రైట్స్ కి భారీ ఆఫ‌ర్‌!


రామ్ `రెడ్‌` డిజిట‌ల్ రైట్స్ కి భారీ ఆఫ‌ర్‌!
రామ్ `రెడ్‌` డిజిట‌ల్ రైట్స్ కి భారీ ఆఫ‌ర్‌!

రామ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `రెడ్‌`. కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్నారు. నివేదా పేతురాజ్‌, మాళ‌విక శ‌ర్మ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. స్ర‌వంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేస్తూ న‌టించిన తొలి థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం రామ్ న‌టించిన 18వ చిత్రం కావ‌డం విశేషం.

లాక్‌డౌన్ బిఫోర్ ఈ మూవీని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు కానీ లాక్‌డౌన్ అమ‌ల్లోకి రావ‌డం, థియేట‌ర్లు మూసివేయ‌డంతో రిలీజ్ గ‌త ఏడు నెల‌లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఓటీటీ రిలీజ్‌కి భారీ స్థాయిలో ఆఫ‌ర్లు ల‌భిస్తున్నా సినిమాపై వున్న న‌మ్కంతో ఈ చిత్రాన్ని థియేట‌ర్లో మాత్ర‌మే రిలీజ్ చేస్తామంటూ రామ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నాడు. ఇదిలా వుంటే ఈ చిత్ర డిజిట‌ల్ రైట్స్ భారీ డిమాండ్ ఏర్ప‌డింది.

దీంతో ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చాన‌ల్ జెమిని టివి 13 . 5 కోట్లు చెల్లించి ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ని సొంతం చేసిన‌ట్టు తెలిసింది. దీంతో ఈ మూవీకి ఖ‌ర్చు చేసిన బ‌డ్జెట్‌లో స‌గం తిరిగి వ‌చ్చిన‌ట్టే అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారా కొంత అమౌంట్ వ‌చ్చినా రామ్ ప్రాజెక్ట్ సేఫ్ అయిన‌ట్టేన‌ని చెబుతున్నారు.  ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.