ప్రభాస్ కు పోటీగా అక్షయ్ కుమార్?


ప్రభాస్ కు పోటీగా అక్షయ్ కుమార్?
ప్రభాస్ కు పోటీగా అక్షయ్ కుమార్?

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న చిత్రం ఆది పురుష్. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఆది పురుష్ రామాయణం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న చిత్రం. సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో లంకేశ్ పాత్రలో మెరవనున్నాడు. మొత్తంగా ఆది పురుష్ పై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇక ఇప్పుడు ఆది పురుష్ కు పోటీగా మరో రామాయణం ఆధారిత చిత్రం వస్తుండడంతో ఫిల్మ్ సర్కిల్స్ లో వీటి గురించే డిస్కషన్ నడుస్తున్నాయి. బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్న చిత్రం రామ్ సేతు. టైటిల్ చూసే ఈ చిత్రం దేని గురించి అన్న విషయాన్ని చెప్పేయొచ్చు.

సీత జాడను వెతికే క్రమంలో రామ్ సేతు యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఒకే సమయంలో రెండు రామాయణం ఆధారిత సినిమాలు వస్తుండడంతో ప్రేక్షకులు ఓటు దేనికి పడుతుంది అన్న ఆసక్తికరంగా ఉంది.