రామ్ కొత్త సినిమాకు మరో ఆరు నెలలు పట్టేలా ఉందిగా


రామ్ కొత్త సినిమాకు మరో ఆరు నెలలు పట్టేలా ఉందిగా
రామ్ కొత్త సినిమాకు మరో ఆరు నెలలు పట్టేలా ఉందిగా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ వరస ప్లాపుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా తన కెరీర్ ను తిరిగి గాడిలో పెట్టింది. ఈ విజయం తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా రామ్, రెడ్ అనే చిత్రాన్నిమొదలుపెట్టాడు. మార్చ్ లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది.

ఇక రామ్ పోతినేని ఎందుకో రెడ్ పూర్తైన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. లాక్ డౌన్ లో అందరూ సినిమాలను కన్ఫర్మ్ చేయడానికి వాడుకుంటే రామ్ మాత్రం ఈ విషయంలో బాగా వెనకడుగు వేసాడు. ఎన్ని కథలు విన్నా ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సురేందర్ రెడ్డి వంటి దర్శకులు కూడా కథలు చెప్పడానికి ఆసక్తి ప్రదర్శించినా కుదర్లేదు.

మొత్తానికి ఇప్పుడు రామ్ తన తర్వాతి సినిమా కోసం ఇంకా వెయిటింగ్ లోనే ఉన్నాడు. ప్రస్తుతం దర్శకులు అందరూ ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో రామ్ తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టడానికి కనీసం ఆరు నెలలు పట్టే అవకాశముంది.