ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ఉస్తాద్?

ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ఉస్తాద్?
ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ఉస్తాద్?

ఇటీవ‌ల `రెడ్‌` థ్రిల్ల‌ర్‌తో ఆక‌ట్టుకున్న ఉస్తాద్‌ రామ్ ఈ మూవీ త‌రువాత మ‌రో భారీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌నుకున్నారు. ఇందుకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కావాల‌నుకున్నారు. కానీ అప్ప‌టికే త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌కి లాక్ అయిపోవ‌డంతో ఆ స్థానంలో యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

‌శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ ఊవీ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. రామ్ 19వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. హైవోల్టేజ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా రామ్ న‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. ‌

తెలుగు, త‌మిళ భాష‌లో రూపొందుతున్న ఈ మూవీని హైటెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్థంలో రిలీజ్ చేయాలిన చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. కొంత విరామం త‌రువాత లింగుసామి చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు అనుగునంగానే ఈ మూవీ వుండ‌బోతోందా?  రామ్‌ని కొంత కోణంలో ఆవిష్క‌రిస్తుందా? అన్న‌ది తెలియాటంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.