పోలీస్ పాత్రలో అలరించనున్న రామ్?

పోలీస్ పాత్రలో అలరించనున్న రామ్?
పోలీస్ పాత్రలో అలరించనున్న రామ్?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్ వచ్చిన తర్వాత బాగా స్లో అయిపోయాడు. ఈ ఏడాది మొదట్లో రెడ్ సినిమాతో పలకరించాడు. ఈ సినిమా యావరేజ్ తో సరిపెట్టుకుంది. చాలా నెలల గ్యాప్ తర్వాత తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించడానికి ఎస్ చెప్పాడు రామ్. శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ప్రస్తుతం తన గెటప్ విషయంలో సిద్ధమవుతున్నాడు రామ్.

రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫోటోలో లాంగ్ హెయిర్ తో ఇంప్రెసివ్ గా ఉన్నాడు. ఇక ఈ సినిమా గురించి తెల్సిన మరో విషయం ఏమిటంటే రామ్ పాత్ర పూర్తిగా వయొలెంట్ గా ఉంటుందిట. తన కెరీర్ లో తొలిసారి పోలీస్ పాత్రను పోషిస్తున్నాడు రామ్. చాలా పవర్ఫుల్ గా ఈ పాత్రను డిజైన్ చేసాడట దర్శకుడు లింగుసామి.

ఉప్పెన భామ కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. ఒక ప్రముఖ నటుడు ఈ చిత్రంలో విలన్ గా నటించనున్నాడు. మరిన్ని విశేషాలు త్వరలోనే తెలిసే అవకాశముంది.