రామ్ కు కథ వినిపించిన మహేష్ దర్శకుడు

రామ్ కు కథ వినిపించిన మహేష్ దర్శకుడు
రామ్ కు కథ వినిపించిన మహేష్ దర్శకుడు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత కెరీర్ లో స్లో అయ్యాడు. ఆ సినిమా విజయంతో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ ఏడాది విడుదలైన రెడ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. రెడ్ విడుదల తర్వాత కొన్ని నెలలు బ్రేక్ తీసుకున్న రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామితో తెలుగు – తమిళ ద్విభాషా చిత్రాన్ని సెట్ చేసిన విషయం తెల్సిందే.

కృతి శెట్టి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ను మొదలుపెట్టుకోనుంది. ఇదిలా ఉంటే రామ్ మరో ద్విభాషా చిత్రం చేయబోతున్నాడని తెలుస్తోంది. అగ్ర దర్శకుడు మురుగదాస్ రామ్ తో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నాడట. గతంలో చిరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ చేసిన మురుగదాస్ మరోసారి తెలుగు హీరోతో వర్క్ చేయబోతున్నాడు.

ఇప్పటికే రామ్ కు కథ వినిపించడం జరిగిందట. మరి ఈ విషయంలో రామ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బహుశా మరి కొన్ని వారాలు ఆగితే కానీ ఈ ప్రాజెక్ట్ విషయమై క్లారిటీ రాదేమో.