ఆన్‌లైన్ ట్రోల్స్‌కు హీరో రామ్ రిప్లై!

ఆన్‌లైన్ ట్రోల్స్‌కు హీరో రామ్ రిప్లై!
ఆన్‌లైన్ ట్రోల్స్‌కు హీరో రామ్ రిప్లై!

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన తాజా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `రెడ్‌`. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళ హిట్ చిత్రం `త‌డ‌మ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మాల్విక‌శ‌ర్మ‌, నివేదా పేతురాజ్, అమృత అయ్య‌ర్ హీరోయాన్‌లుగా న‌టించారు. స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై స్రవంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ గురువారం సంక్రాంతి సంద‌ర్భంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం బుధ‌వారం రాత్రి ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వ‌హించింది.

ఈ కార్య‌క్ర‌మానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈవెంట్ చివ‌ర్లో `రెడ్‌` సినిమా టిక్కెట్‌కి బ‌దులు `క్రాక్‌` టీక్కెట్‌ని చిత్ర బృందం ఆవిష్క‌రించింది. అది గ‌మ‌నించిన నెటిజ‌న్‌లు, ఈవెంట్ ఆర్గ‌నైజింగ్ టీమ్‌ని, చిత్ర బృందాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్‌పై హీరో రామ్ స్పందించారు. త‌ప్పులు జ‌ర‌గ‌డం స‌హ‌జం అని తెలిపారు.

`రెడ్‌` ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా విచ్చేసిన త్రివిక్ర‌మ్‌కి ధ‌న్య‌వాదాలు. నాకెంతో ఇష్ట‌మైన అభిమానుల్ని చాలా కాలం త‌రువాత ఈ ఈవెంట్‌లో చూడ‌టం ఎప్ప‌టిలాగే ఆనందంగా వుంది. అప్పుడ‌ప్పుడు త‌ప్పులు జ‌రుగుతుంటాయి. ఏం ఫ‌ర్వాలేదు. శ్రేయ‌స్ మీడియా మీరు ఎప్పుడూ బెస్ట్` అని రామ్ ట్వీట్ చేశారు.