సునీత పిల్ల‌ల‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇస్తోందా?

సునీత పిల్ల‌ల‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇస్తోందా?
సునీత పిల్ల‌ల‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇస్తోందా?

ప్ర‌ముఖ గాయ‌ని సునీత ఇటీవ‌ల రెండో పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్నేళ్ల క్రితం త‌న భ‌ర్త కిర‌ణ్‌తో విడిపోయిన సునీత కొంత కాలంగా త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఒంట‌రిగా జీవిస్తోంది. ఇటీవ‌ల డిజిటల్‌ మీడియా అధినేత రామ్ వీర‌ప‌నేనిని సునీత రెండో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి 9న వీరి వివాహం గ్రాండ్ గా జ‌రిగింది.

వీరిద్ద‌రి వివాహం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది. రెండో పెళ్లిపై చాలా కాలంగా వార్త‌లు షికారు చేస్తున్నా వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌ని, అలాంటి వార్త‌లు ప్ర‌చురించ‌వ‌ద్దంటూ మీడియాకు వెల్ల‌డించిన సునీత తాజాగా త‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం మాత్ర‌మే తాను రెండో పెళ్లి చేసుకుంటున్నాన‌ని వివాహానికి ముందు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

దీంతో సునీత త‌న పిల్ల‌ల‌కు ఎలాంటి గిఫ్ట్‌ని, భ‌విష్య‌త్తుని అందించ‌బోతోందంటూ చ‌ర్చ మొద‌లైంది. ఇదిలా వుంటే సునీత పిల్ల‌ల‌కు రామ్ వీర‌ప‌నేని భారీ గిఫ్ట్‌ని అందించ‌బోతున్నార‌ని, త‌న ఆస్తుల్లో వాటాని అందించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా త‌న బిజినెస్‌లో రామ్ వీర‌ప‌నేని వాటా కూడా ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌.