మరోసారి ప్లాప్ దర్శకుడితో ఇస్మార్ట్ రామ్ 


ram vv vinayak movie
మరోసారి ప్లాప్ దర్శకుడితో ఇస్మార్ట్ రామ్ 

ఎనర్జిటిక్ స్టార్ రామ్, నిఖార్సైన హిట్ చాలా ఏళ్ల తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో అందుకున్నాడు. ఈ సినిమాకు ముందు రామ్, పూరి జగన్నాథ్ ఇద్దరూ ప్లాపుల్లో ఉన్నారు. పూరి అయితే హిట్ అనే మాట విని కూడా చాలా కాలమైంది. అయినా కూడా రామ్, పూరితో పనిచేసాడు. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ భారీ హిట్ సాధించింది. పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు ఈ సినిమా తెచ్చిపెట్టింది.

అయితే హిట్ అందుకున్నా కానీ రామ్ మరోసారి ప్లాపుల్లో ఉన్న దర్శకుడితోనే పనిచేయనున్నట్లు తెలుస్తోంది. రామ్ తన తర్వాతి సినిమాను వివి వినాయక్ తో ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం ఇంకా చర్చల్లోనే ఉన్నా దాదాపు ఈ సినిమా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.

వినాయక్ కూడా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు. బాలకృష్ణతో సినిమా వచ్చినట్లే వచ్చి చేజారింది. వెంకటేష్ – నారా రోహిత్ కాంబినేషన్ లో విక్రమ్ వేద రీమేక్ అనుకున్నా అది కూడా సెట్ అవ్వలేదు. ఇలా సినిమాలు వచ్చినట్లే వచ్చి చేజారినా వినాయక్ మొత్తానికి మంచి ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడు.