రామ‌రాజు ఫ‌ర్ భీమ్ .. ఫ్యాన్స్‌కి పండ‌గేనా‌!


రామ‌రాజు ఫ‌ర్ భీమ్ .. ఫ్యాన్స్‌కి పండ‌గేనా‌!
రామ‌రాజు ఫ‌ర్ భీమ్ .. ఫ్యాన్స్‌కి పండ‌గేనా‌!

లాక్‌డౌన్ టైమ్‌లో రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే చేసుకున్నారు. ఈ సంద‌ర్భంలో `ఆర్ఆర్ఆర్‌` నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ని అందించి ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకున్నారు రాజ‌మౌళి. ఆ త‌రువాత ఎన్టీఆర్ బ‌ర్త్‌డే వ‌చ్చింది. కానీ `ఆర్ఆర్ఆర్` టీమ్ నుంచి నో స‌ర్‌ప్రైజ్‌.. కార‌ణం ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫుటేజ్ లేక‌పోవ‌డ‌మే. అంత వ‌ర‌కు ఎన్టీఆర్‌పై కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌క‌పోవ‌డ‌మే.

దీంతో బ‌ర్త్‌డే ట్రీట్ ఇవ్వ‌లేక‌పోతున్నాం అంటూ జ‌క్క‌న్న స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ అస‌హ‌నానికి గుర‌య్యారు. ఇటీవ‌లే ‌`ఆర్ఆర్ఆర్‌`షూట్ స్టార్ట్ చేశారు. కీల‌క ఘ‌ట్టాలని ఎన్టీఆర్ పై చిత్రీక‌రణ మొద‌లైంది. దీంతో ఎన్టీఆర్ లుక్‌కి సంబంధించిన టీజర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నామంటూ రాజ‌మౌళి అండ్ టీమ్ ప్ర‌క‌టించింది.

ఈ నెల 22న రామ‌రాజు ఫ‌ర్ భీమ్ పేరుతో ఎన్టీఆర్ లుక్‌కి సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. మీకు వాగ్ధానం చేసిన‌ట్టు తార‌క్ కు సంబంధించిన అత్యుత్త‌మ‌మైన‌దాన్ని అందించ‌బోతున్నాం అని రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్రామిస్ చేశాడు. అందుకు త‌గ్గ‌ట్టే రామ‌రాజు ఫ‌ర్ భీమ్‌ని సిద్ధం చేస్తున్నాడు రాజ‌మౌళి. ఈ టీజ‌ర్‌ని స‌రిగ్గా ఈ నెల 22న ఉద‌యం 11 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌బోతున్నారు. టీజ‌ర్ ఫ్యాన్స్ కి పండ‌గే అని తెలుస్తోంది.