ప్రీలుక్ టీజ‌రే ఇలా వుంటే టీజ‌ర్ భీభ‌త్స‌మే!


ప్రీలుక్ టీజ‌రే ఇలా వుంటే టీజ‌ర్ భీభ‌త్స‌మే!
ప్రీలుక్ టీజ‌రే ఇలా వుంటే టీజ‌ర్ భీభ‌త్స‌మే!

రాజ‌మౌళి ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ `ఆర్ఆర్ఆర్‌` నుంచి రేపు స‌ర్‌ప్రైజ్ రాబోతోంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ ఫిక్ష‌న‌ల్ పిరియాడిక్ ఫిల్మ్‌గా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. డీవీవీ దాన‌య్య అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ గ‌త ఏడు నెల‌లుగా ఆగిపోయింది. లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయిన షూటింగ్‌ని ఇటీవ‌లే ప్రారంభించారు.

ఎన్టీఆర్ పై ఇటీవ‌ల కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు. టీజ‌ర్‌కు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నామ‌ని ఈ నెల 22న ఎన్టీఆర్ భీమ్‌కు సంబంధించిన టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తున్నామంటూ ఈ మూవీ షూటింగ్ పునః ప్రారంభ‌మైన రోజునే రాజ‌మౌళి స్ప‌ష్టం చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అన్న‌ట్టుగానే మైండ్ బ్లోయింగ్ టీజ‌ర్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వ‌బోతున్నారు. `రామ‌రాజు ఫ‌ర్ భీమ్‌` పేరుతో టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

తాజాగా రామ్‌చ‌ర‌ణ్ ప్రీలుక్ క్లిప్‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వాట‌ర్ లోంచి బ‌ల్లెం తీస్తున్న వీడియో క్లిప్ టీజ‌ర్‌పై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. బ్ర‌ద‌ర్ నీకోసం ఓ చిన్న గిఫ్ట్ వుంది. దాన్ని టైమ్‌కే ఇస్తా అంటూ రామ్ చ‌ర‌ణ్ కామెంట్ చేయ‌డం.. ఇప్ప‌టికే ఐదు నెల‌లు ఆల‌స్య‌మైంది బ్ర‌ద‌ర్ జ‌క్క‌న్న‌తో డీల్ చేస్తున్నారు జాగ్ర‌త్త అని ఎన్టీఆర్ దానికి బ‌దులివ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది.