అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్


Ramcharan as Alluri Seetharamaraju in RRR

అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ నటించనున్నట్లు ప్రకటించాడు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి . స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి పాత్రని పోషించడం నా అదృష్టమని ప్రకటించాడు చరణ్ . ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ”. 400 కోట్ల  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2020 జులై 30 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

 

భారత దేశ స్వాతంత్య్రం కోసం తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు , కొమరం భీం లు ఎంతగానో పోరాడారు . బ్రిటిష్ వాళ్ళని ఎదురించి పోరాడిన ధీరుడు అల్లూరి సీతారామరాజు కాగా నైజాం నవాబుని ఎదుర్కొని పోరాడిన చరిత్ర కొమరం భీం ది . అల్లూరి గా చరణ్ నటిస్తుండగా కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్నారు . ఈ సినిమా కోసం ఎన్నో నేర్చుకున్నామని , ఈ సినిమా మాకు పెద్ద బాలశిక్ష లాంటిదని ….. ఈ సినిమా వల్ల నేను తారక్ మంచి ఫ్రెండ్స్ అయ్యామని అందుకు రాజమౌళి కి కృతఙ్ఞతలు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసాడు చరణ్ . అన్నట్లు చరణ్ కు జోడిగా బాలీవుడ్ భామ అలియా భట్ నటించనుంది .

English Title: Ramcharan as Alluri Seetharamaraju in RRR