మహేష్ రికార్డ్ ని బద్దలు కొట్టిన చరణ్


ramcharan beats mahesh record in overseasఓవర్ సీస్ లో మహేష్ బాబు శ్రీమంతుడు రికార్డ్ ని బద్దలు కొట్టాడు చరణ్ తన రంగస్థలం చిత్రంతో . ఓవర్ సీస్ లో రంగస్థలం చిత్రం మూడు మిలియన్ డాలర్ల మార్క్ ని అందుకుంది . గతంలో ఒక్క బాహుబలి చిత్రం మాత్రమే మూడు మిలియన్ డాలర్ల మార్క్ ని అందుకుంది తప్ప మరే తెలుగు చిత్రం కూడా ఆ స్థాయిని అందుకోలేక పోయింది . అయితే మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రం మాత్రం $2,89 మిలియన్ డాలర్ల ని వసూల్ చేయగా ఇప్పుడు ఆ రికార్డ్ ని బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్ సృష్టించాడు చరణ్ .

మార్చి 30 న విడుదలైన రంగస్థలం అన్ని చోట్లా భారీ వసూళ్ల ని సాధిస్తోంది . చరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధిస్తూ నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలుస్తోంది . ఓవర్ సీస్ లో మాత్రం నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ అయ్యింది ఇక ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో కూడా ఆ దిశగా దూసుకు పోతోంది .