జగదేకవీరుడు గా రాంచరణ్


ramcharan boyapati srinu gets jagadekaveerudu titleరంగస్థలం ఇచ్చిన కిక్ తో చాలా సంతోషంగా ఉన్నాడు రాంచరణ్ . తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు , మహేష్ సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించిన కియారా అద్వానీ హీరోయిన్ కాగా ఈ చిత్రానికి తాజాగా ” జగదేకవీరుడు ” అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది . ఇంతకుముందు ”రాజవంశస్తుడు ” అనే టైటిల్ బాగా వినిపించింది అయితే ఆ టైటిల్ పెట్టడం లేదని ఆ చిత్ర బృందం తేల్చి చెప్పేసింది .

ఇక ఇప్పుడేమో ”జగదేకవీరుడు ” అనే టైటిల్ వినబడుతోంది . అయితే ఈ టైటిల్ పట్ల మాత్రం యూనిట్ ఆలోచన చేస్తోందట ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి – శ్రీదేవి ల కాంబినేషన్ లో వచ్చిన ” జగదేక వీరుడు – అతిలోక సుందరి ” అప్పట్లో ప్రభంజనం సృష్టించింది . దాంతో చిరంజీవి జగదేకవీరుడు టైటిల్ పట్ల సానుకూలంగా ఉండటం ఖాయం , పైగా దర్శకుడు బోయపాటి శ్రీను కాబట్టి యాక్షన్ కు కేరాఫ్ అడ్రస్ కాబట్టి జగదేకవీరుడు టైటిల్ యాప్ట్ అని భావిస్తున్నారు .