కేటీఆర్ ని సవాల్ చేసిన చరణ్


Ramcharan challenged KTR

మెగా హీరో రాంచరణ్ తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ని ఛాలెంజ్ చేసాడు . ఛాలెంజ్ అనగానే అతడిపై విమర్శలు చేస్తున్నాడు అని అనుకోవద్దు తాజాగా దేశ వ్యాప్తంగా ఫిట్ నెస్ ఛాలెంజ్ జరుగుతోంది , కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ విసిరిన సవాల్ మెల్లిమెల్లిగా దేశమంతా పాకుతోంది ముఖ్యంగా తెలుగునాట హీరోలను పట్టి పీడిస్తోది . ఒక్కో హీరో ఆ సవాల్ ని స్వీకరిస్తూ మరో ముగ్గురికి సవాల్ విసురుతున్నారు ఆయా హీరోలు .

ఎన్టీఆర్ విసిరిన సవాల్ ని స్వీకరించిన చరణ్ జిమ్ లో కష్టపడుతూ ఫిట్ నెస్ ని నిరూపించుకున్నాడు . ఇక తన పని పూర్తిచేసానని చేయాల్సింది మీరే అంటూ తండ్రి మెగాస్టార్ చిరంజీవి కి తెలంగాణ మంత్రి కేటీఆర్ కు అలాగే దర్శకులు సుకుమార్ తో పాటుగా సోదరుడు వరుణ్ తేజ్ కు సవాల్ విసిరాడు చరణ్ . అంతేకాదు తాను పడిన కష్టమేంటో అందరికీ తెలిసేలా జిమ్ వీడియో ని పోస్ట్ చేసాడు . ఇక ఈ సవాల్ ని కేటీఆర్ ఎప్పుడు స్వీకరిస్తాడో చూడాలి . కేటీఆర్ విషయాన్నీ పక్కన పెడితే చిరంజీవి కిది పెద్ద సవాలే మరి .