స్నేహితుడికి రామ్‌చ‌ర‌ణ్ గ్రేట్ పార్టీ!

స్నేహితుడికి రామ్‌చ‌ర‌ణ్ గ్రేట్ పార్టీ!
స్నేహితుడికి రామ్‌చ‌ర‌ణ్ గ్రేట్ పార్టీ!

స్టార్ హీరోల్లో చాలా మంది స్నేహితులు, ప్రాణ స్నేహితులు వున్నార‌న్న‌ది చాలా మందికి తెలియ‌దు. ప్ర‌భాస్‌, గోపీచంద్ మంచి మిత్రులు. అదే విధంగా అల్లు అర్జున్‌, గోపీచంద్ కూడా మంచి మిత్రులే. ఇదే త‌ర‌హాలో మ‌హేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ .. ఈ ముగ్గురి మ‌ధ్య మంచి స్నేహ బంధం వుంది. ఇక యంగ్ హీరో శర్వానంద్, రామ్ చరణ్ మంచి స్నేహితులు. యువి క్రియేషన్స్‌కు చెందిన విక్ర‌మ్‌తో ఈ ఇద్ద‌రికి మంచి అనుబంధం వుంది.

తాజాగా శ‌ర్వానంద్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ ముగ్గురు క‌లిశారు. ఇంకే ముందు శ‌ర్వాకు చ‌ర‌ణ్ ఇంట్లో గ్రేట్ బ‌ర్త్‌డే పార్టీ అరేంజ్ చేశారు. ప్ర‌త్యేకంగా శుక్ర‌వారం రాత్రి శ‌ర్వానంద్‌తో చరణ్, విక్రమ్ కేక్ క‌ట్ చేయించి బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేశారు. రామ్ చరణ్ తన నివాసంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించినందుకు గానూ శ‌ర్వా ప్ర‌త్యేకంగా చ‌ర‌ణ్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

పార్టీ కి సంబంధించిన  కొన్ని ఫొటోలను పోస్ట్ చేస్తూ `గొప్ప పార్టీని నిర్వహించినందుకు ధన్యవాదాలు రామ్‌చ‌ర‌ణ్‌` అని ట్వీట్ చేశారు. శర్వానంద్ న‌టిస్తున్న తదుపరి చిత్రం `శ్రీకారం` ఈ నెల‌లోనే విడుదల కానుంది. ఈ మూవీతో పాటు అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తున్న `మహా సముద్రం`, కిషోర్ తిరుమ‌ల రూపొందించ‌నున్న `ఆడాళ్లూ మీకు జోహార్లు` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ త్వ‌ర‌లోనే లాంఛ‌నంగా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది.